మలయాళ నటుడు షైన్ టామ్ చాకో దసరా, దేవర వంటి సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యాడు. షైన్ హీరోగా నటించిన తాజా మలయాళ సినిమా ‘సూత్రవాక్యం’. విన్సీ ఆలోషియస్ హీరోయిన్. సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై కాండ్రేగుల లావణ్యా దేవి సమర్పణలో కాండ్రేగుల శ్రీకాంత్ నిర్మించిన ఈ సినిమా జూలై 11న థియేటర్లలో విడుదలైంది. థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకంది.
Also Read : Mirai : దర్శకుడు, హీరోకు మిరాయ్ నిర్మాత కాస్ట్ లీ గిఫ్ట్
అయితే ఇటీవల ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ప్రముఖ ఓటీటీ అయిన అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను భారీ ధరకు కొనుగోలు చేయగా ఆగస్టు 21వ తేదీ నుంచి పాన్ ఇండియా బాషలలో స్ట్రీమింగ్ కు తీసుకువచ్చింది. మంచి కథ, కథనం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఓటీటీ ఆడియెన్స్ ను మెప్పిస్తూ తాజాగా 100 మిలీయన్ స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ మార్క్ ను అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని అధికారకంగా తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది అమేజాన్ ప్రైమ్ వీడియో. కథ చెప్పడంలో కొత్తదనాన్ని చూపించి ఫ్రెష్ స్క్రీన్‌ప్లే, డార్క థ్రిల్లర్ గా దర్శకుడు యూజియన్ జాస్ చిరమ్మల్ ఈ సినిమాను ఆసక్తికరంగా మలిచాడు. లీడ్ రోల్స్ చేసిన షైన్ టామ్ చాకో, విన్సీ ఆలోషియస్ అద్భుతంగా నటించారు. అలాగే చిత్ర నిర్మాత కాండ్రేగుల శ్రీకాంత్ పోలీస్ పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నాడు. ప్రైమ్ లో ట్రేండింగ్ లో ఉన్న ఈ సినిమా మరొక మైల్ స్టోన్ వ్యూస్ రాబట్టే దిశగా వెళ్తోంది.