టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్.. నిర్మాణ రంగంతో పాటు సినిమాల పంపిణి రంగంలోను ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. అన్నపూర్ణ సంస్థకు రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాల డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు కూడా ఉన్నాయి. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించి ఇప్పుడో మరో సెన్సేషనల్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కేవలం తెలుగు సినిమాలు మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తున్న అన్నపూర్ణ తొలిసారి నాన్-తెలుగు చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. కంటెంట్ బేస్ సినిమాలకు కేరాఫ్ అయిన మలయాళంలో దింజిత్ అయ్యతన్ డైరేక్షన్ లో ‘EKO’ అనే మిస్టరీ థ్రిల్లర్ తెరకెక్కింది. ఈ నెల 21న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకుని రిలీజ్ చేస్తోంది అన్నపూర్ణ స్టూడియోస్ .
Also Read : Lubber Pandhu : తమిళ్ సూపర్ హిట్ ‘లబ్బర్ పందు’ని తెలుగులో రీమేక్ చేస్తున్న సీనియర్ హీరో
EKO సినిమాను తెలుగులోకి తీసుకువస్తున్న తరుణంలో అన్నపూర్ణ స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుప్రియా యార్లగడ్డ మాట్లాడుతూ ‘ మలయాళ సినిమా ఎప్పుడు విభిన్నమైన కథలతో, సరికొత్త మేకింగ్ తో సినిమాలు చేస్తుంది. ఇటీవల అనేక మలయాళ సినిమాలు తెలుగులో ప్రేక్షకాదరణ పొందాయి. ఈ సినిమా టీజర్, ట్రయిలర్ చూసినపుడు ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలనిపించింది. మిస్టీరియస్ థ్రిల్లర్ గా వస్తున్న EKO తెలుగు ఆడియెన్స్ ను మెప్పిస్తుందని మాకు నమ్మకం ఉంది. మొదటిసారిగా మలయాళ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం మాకు ఎంతో ముఖ్యమైన విషయం. ఏపీ, టీఎస్‌లో ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయబోవుతున్నాం. మా సంస్థ నుండి ఇక నుండి సరికొత్త సినిమాలు రాబోతున్నాయి’ అని అన్నారు.
