మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన 75వ చిత్రం ‘మాస్ జాతర’. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా కనిపించిన ఈ సినిమాకు. భాను భోగవరపు అనే డెబ్యూడెంట్ దర్శకత్వం వహించాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. గత ఏడాది దీపావళికి రిలీజ్ కావాల్సిన సినిమా.. అనేక వాయిదాలు, రిషూట్లు అనంతరం అక్టోబరు 31న ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది.
Also Read : RAPO : రెండు రోజుల ముందుగానే ఆంధ్ర కింగ్ తాలుకా ప్రీమియర్స్.. ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూడబోతున్న రామ్
కానీ ప్రీమియర్ షో నుండే ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. రొటీన్ రెగ్యులర్ కథ, బోరింగ్ స్క్రీన్ ప్లేతో ఆడియెన్స్ కు విసుగుతెప్పించాడు దర్శకుడు. రాజేంద్ర ప్రసాద్ క్రింజ్ కామెడి నవ్వుతెప్పించకపోగా విసిగించింది. ప్రీమియర్స్ షోస్ కు వచ్చిన నెగిటివ్ టాక్ ప్రభావం డే 1 కలెక్షన్స్ పై చూపించింది. కనీసం మినిమం వసూళ్లు కూడా రాబట్టలేక రవితేజ కెరీర్ లో మరో డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఇటీవల మిమ్మల్ని నిరాశపరించాను మాస్ జాతర తో సాలిడ్ హిట్ ఇస్తానన్న రవితేజ నమ్మకాన్ని ఈ సినిమా నిలబెట్టలేకపోయింది. 2022లో వచ్చిన ధమాకా రవితేజ కెరీర్ లో చివరి హిట్. గత మూడేళ్ళుగా హిట్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఆయన ఫ్యాన్స్ ఆశలన్నీ రాబోయే 76వ సినిమాపైనే. నేను శైలజ, చిత్ర లహరి వంటి సినిమాలకు డైరెక్ట్ చేసిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో అయిన ఒక హిట్ కొట్టి ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.