అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి, ఇప్పుడు సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ కంపోజర్‌గా మారిపోయాడు అనిరుద్ రవిచందర్. మొదట తమిళంలో తన సత్తా చాటిన అనిరుద్, తర్వాత తెలుగు, హిందీ భాషల్లో సైతం వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అయితే, ఇప్పుడు తమిళ, హిందీ భాషల కంటే ఎక్కువగా తెలుగు మార్కెట్‌పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్‌తో ‘దేవర’ లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన అనిరుద్, విజయ్ దేవరకొండతో ‘కింగ్‌డమ్’ సినిమా చేస్తున్నాడు. నానితో ‘ప్యారడైజ్’ సినిమాకు కూడా కమిట్ అయ్యాడు.
ALso Read:Kota Srinivasa Rao : కన్నీటి వీడ్కోలుతో ముగిసిన కోట అంత్యక్రియలు
అయితే, ఈ అన్ని సినిమాల్లో అతని పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, తాను చేయబోయే తదుపరి తెలుగు చిత్రాలకు ఫీజు పెంచినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయన 12 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుండగా, ఇకమీదట మూడు కోట్లు పెంచి 15 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. తాను చేస్తున్న మ్యూజిక్‌తోనే ఆ డబ్బు వెనక్కి వస్తోందని చెబుతున్న అనిరుద్, రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేది లేదని అంటున్నాడు. ఇక, పక్కనే ఉన్న తమిళనాడులో అతనికి ‘జైలర్ 2’తో పాటు విజయ్ చివరి సినిమా కూడా చేతిలో ఉంది.
