Site icon NTV Telugu

Anirudh Ravichander: అనిరుధ్ హుకుమ్ కచేరీకి.. హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్

Anirudh

Anirudh

యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ప్రపంచవ్యాప్తంగా జరుపే ‘హుకుమ్’ మ్యూజికల్ కచేరీలకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనిరుధ్ ఆగస్టు 23న చెన్నై సమీపంలోని స్వర్ణభూమి రిసార్ట్స్‌లో ఈ భారీ కచేరీ నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే బుకింగ్స్ మొదలై, అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. కానీ, కచేరీ నిర్వాహకులు కలెక్టర్ అనుమతి లేకుండా, అవసరమైన సౌకర్యాలను అందించకుండా ఈ వేడుకను ప్రణాళిక చేసారని చెయ్యూర్ నియోజకవర్గ శాసనసభ్యుడు పనైయూర్ బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Also Read : AA22×A6 : అల్లు అర్జున్ – అట్లీ కాంబో హాలీవుడ్ టచ్‌తో భారీ ప్లాన్!

ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి ఆనంద్ వెంకటేష్ అనిరుధ్ కచేరీ నిర్వహణకు అనుమతి ఇచ్చారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే మహాబలిపురం డీఎస్పీ నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచనలు చేశారు. హైకోర్టు తీర్పుతో, అనిరుధ్ అభిమానులు ఆనందంలో మునిగి పోయారు. ఈ కచేరీ విజయవంతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని యూనిట్ తెలిపింది.

 

Exit mobile version