January 12 Vidudala : ఆ ఫార్మాట్ మారింది.. కానీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనిల్ రావిపూడి సినిమా నుంచి ఏది వచ్చినా సెన్సేషనే. ప్రమోషనల్ ప్రోమో వస్తుందంటే, ఏ పాత సినిమా నుంచి ఏ సీన్ తీసుకొని రీక్రియేట్ చేస్తాడన్న ఆసక్తి అందరిలో పెంచేస్తాడు. అయితే ఈసారి ఆ ఒక్క విషయంలో మాత్రం అంచనాలను అందుకోలేకపోయాడు. అదేంటో చూసేద్దామా? ఈ మధ్యకాలంలో అనిల్ రావిపూడి ఫస్ట్ సింగిల్‌తోనే హైప్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాడు. అందరూ మర్చిపోయిన గాయకులతో పాడిస్తూ, లిరికల్ సాంగ్ రిలీజ్‌కి ముందే ఓ ప్రమోషనల్ వీడియోతో సింగర్‌ను పరిచయం చేస్తూ హైప్ క్రియేట్ చేశాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వరప్రసాద్’ విషయంలో ఇదే ఫార్ములాతో సక్సెస్ అయ్యాడు అనిల్. రమణ గోగుల పెక్యులియర్ వాయిస్ పాటలకు ప్లస్ అవుతూ వచ్చింది. ‘ప్రేమంటే ఇదేరా’ తర్వాత వెంకటేష్, రమణ గోగుల కాంబోలో వచ్చిన ‘లక్ష్మి’ కూడా హిట్ అయింది. 18 ఏళ్ల తర్వాత ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీలో వెంకటేష్‌కు పాడాడు రమణ గోగుల. పెక్యులియర్ వాయిస్‌తో ఫస్ట్ ఇంప్రెషన్ కొట్టేయడం అనిల్‌కు కలిసివచ్చింది. చిరంజీవి ఛాన్స్ ఇవ్వడంతో ‘మన శంకర వరప్రసాద్’ కోసం బాగా ఆలోచించి, గతంలో చిరంజీవికి మెలోడీ సాంగ్స్ పాడిన ఉదిత్ నారాయణ్‌ను మళ్ళీ తీసుకొచ్చాడు అనిల్. ‘చూడాలని ఉంది’లో ఎవర్గ్రీన్ క్లాసిక్ సాంగ్ ‘రామ్మా చిలకమ్మ’ను ఉదిత్ నారాయణ్ పాడాడు. ముందు ఉదిత్‌ను చిరంజీవి రిజెక్ట్ చేసినా, వాయిస్ పాటకు ప్లస్ కావడంతో ఆ తర్వాత చాలా సినిమాల్లో చాలా పాటలకు ఉదిత్ పాడారు. అందరూ మర్చిపోయిన ఈ వాయిస్‌ను మళ్ళీ పరిచయం చేసి ‘మీసాల పిల్ల’ పాడించాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వరప్రసాద్’ ఫస్ట్ సింగిల్స్ సినిమాకు కావాల్సినంత హైప్ తీసుకొచ్చి, మ్యూజికల్ హిట్స్‌కు తెరలేపాయి.
అయితే ‘జనవరి 12 విడుదల’ విషయంలో ఈ ఫార్మాట్‌కు అనిల్ దూరంగా ఉన్నాడు. అదే దారిలో వెళ్తూ నోటెడ్ సింగర్‌తో పాడించకపోయినా, ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వరప్రసాద్’ ఫస్ట్ సింగిల్ రేంజ్లో ‘జనవరి 12 విడుదల’ సాంగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. అయితే వీళ్ల అంచనాలను ఫస్ట్ సింగిల్ అందుకోలేకపోయింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వరప్రసాద్’కు భీమ్స్ మ్యూజిక్ ఇచ్చాడు. అయితే ‘జనవరి 12 విడుదల’ దగ్గరికి వచ్చేసరికి మ్యూజిక్ డైరెక్టర్ మారిపోయాడు. భీమ్స్ ప్లేస్‌లో జీవీ ప్రకాష్ వచ్చాడు. తెలుగు, తమిళంలో వరుస హిట్స్‌తో మంచి ఫామ్‌లో ఉన్న జీవీ నుంచి అదిరిపోయే ట్యూన్ వస్తుందని మ్యూజిక్ లవర్స్ వెయిట్ చేస్తే, వీళ్ల అంచనాలకు ఫస్ట్ సింగిల్ రీచ్ కాలేకపోయింది. మరి సెకండ్ సాంగ్‌తో అయినా హైప్ తీసుకొస్తాడేమో చూడాలి మరి. ‘జనవరి 12 విడుదల’ ఫస్ట్ సింగిల్ అంచనాలను చేరుకోకపోవడంతో సోషల్ మీడియాలో డైరెక్టర్‌పై కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రమోషనల్ వీడియోపై పెట్టే శ్రద్ధ సినిమాపై పెట్టాలంటూ ఎవరికి తోచినట్లు వాళ్లు సలహాలు ఇచ్చేస్తున్నారు. సినిమా బాగుంటే ప్రమోషన్ అక్కర్లేదని, మౌత్ టాక్ సరిపోతుందని అంటున్నారు.
Also Read
- Sreeleela : శ్రీ లీల బ్యాడ్ టైం ఇంకా అయిపోలేదా?
- Anirudh : గురువును మర్చిపోయిన రాక్‌స్టార్..అనిరుధ్ రిసెప్షన్‌కు ధనుష్ డుమ్మా?
- Mythri Movie Makers: తెలుగు సినిమా చరిత్రలో కీలక ఘట్టం.. స్టాక్ మార్కెట్ (IPO) బాట పట్టబోతోన్న మైత్రీ మూవీ మేకర్స్
- Anil Ravipudi-NTR: ఎన్టీఆర్‌తో సినిమా.. అప్డేట్ అడిగితే స్టేజ్ దిగిపోయిన అనిల్!
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-9 Live : నేడు మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కల్యాణం.. తొమ్మిదో రోజు వేడుకలివే..!
-
January 12 Vidudala : ఆ ఫార్మాట్ మారింది.. కానీ?
-
Saturn Transit 2027 : 2027లో శని సంచారం.. ఈ 7 రాశులకు అదృష్టం..!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
Sreeleela : శ్రీ లీల బ్యాడ్ టైం ఇంకా అయిపోలేదా?
ట్రెండింగ్
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్‌లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!