ఈ మధ్యకాలంలో నటుడు శివాజీ, హీరోయిన్ల వస్త్రధారణ గురించి ఇచ్చిన సలహా ఎంత వైరల్ అయిందో, ఎంత వివాదానికి దారితీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి స్రవంతి యాంకర్‌గా వ్యవహరించింది. ఆ రోజు ప్రపంచ చీరల దినోత్సవం కావడం, అదే రోజు ఆమె నిండుగా చీర కట్టుకుని రావడంతో శివాజీ ఆమెను ప్రశంసించే ప్రయత్నం చేస్తూనే హీరోయిన్లకు సలహా ఇచ్చారు. సలహా ఇవ్వడంలో భాగంగా సామాన్లు, “దరిద్రపుగొట్టు…” అంటూ మాట్లాడిన నేపథ్యంలో, అది పెను వివాదానికి దారితీసింది.
Also Read: Rakul Preet Brother: టాలీవుడ్‌లో ప్రకంపనలు.. డ్రగ్స్ కేసులో మళ్ళీ ఇరుక్కున్న రకుల్ ప్రీత్ సోదరుడు
ముందుగా చిన్మయి, అనసూయ వంటి వాళ్లు ఈ విషయాన్ని ఎండగడుతూ పోస్టులు పెట్టడం, తర్వాత మహిళా కమిషన్ సైతం ఈ విషయం మీద సీరియస్ అయ్యి 27వ తారీకు, అంటే ఈ రోజుకి హాజరు అయ్యేలా చూడమని కోరడం అందరికీ తెలిసిందే. ఒకరకంగా చెప్పాలంటే, స్రవంతిని ప్రశంసించబోయి శివాజీ ఈ పెను వివాదంలో చిక్కుకున్నాడని చెప్పాలి.
అలాగే ఇది ఇంత వివాదానికి కారణం అవడంలో ముఖ్య భూమిక పోషించింది అనసూయ. ఆమె వరుస పోస్టులు పెడుతూ రావడంతో పాటు, మీడియా ముఖంగా స్పందించడంతో ఈ విషయం బాగా జనాల్లోకి వెళ్ళింది. అయితే శివాజీకి మద్దతు ఇచ్చేవాళ్ళు కొంతమంది, ఆమెను వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది అన్నట్లుగా విడిపోయి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూ కొట్టుకుంటున్నారు.
Also Read: Getup Srinu: పక్కన ఎవరైనా వాయిస్తున్నారా?.. రివ్యూయర్స్ పై గెటప్ శ్రీను సంచలనం
ఆ సంగతి పక్కన పెడితే, ఈ వివాదానికి కారణమైన యాంకర్ స్రవంతి (పాపం ఆమె తప్పు ఏమీ లేదు), దాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లిన అనసూయ (ఆమె తప్పు కూడా లేదు), ఇద్దరూ తాజాగా కలిసి ఫోటో ఒకటి షేర్ చేశారు. తాజాగా ఈ ఫోటోని యాంకర్ స్రవంతి తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి దేవస్థానంలో కలిసినట్టుగా అందులో పేర్కొంది. మొత్తం మీద ఒకపక్క శివాజీ వివాదంలో చిక్కుకుని మహిళా కమిషన్ ముందుకు వెళ్లి హాజరవ్వాల్సిన పరిస్థితి ఏర్పడితే, వీరిద్దరూ కలిసి ఫోటోకి ఫోజులు ఇవ్వడం గమనార్హం.
