ఈ మధ్యకాలంలో నటుడు శివాజీ, హీరోయిన్ల వస్త్రధారణ గురించి ఇచ్చిన సలహా ఎంత వైరల్ అయిందో, ఎంత వివాదానికి దారితీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి స్రవంతి యాంకర్‌గా వ్యవహరించింది. ఆ రోజు ప్రపంచ చీరల దినోత్సవం కావడం, అదే రోజు ఆమె నిండుగా చీర కట్టుకుని రావడంతో శివాజీ ఆమెను ప్రశంసించే ప్రయత్నం చేస్తూనే హీరోయిన్లకు సలహా ఇచ్చారు. సలహా ఇవ్వడంలో భాగంగా సామాన్లు, “దరిద్రపుగొట్టు…” అంటూ…