Ananya Raj: 27 ఏళ్లకే నటి అనన్య రాజ్ మృతి.. నెల తర్వాత బయటపడ్డ విషాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ananya Raj: హిందీ, తెలుగు సినిమాలలో నటించిన నటి అనన్య రాజ్ (అనన్య సేన్ గుప్తా) తన 27 సంవత్సరాల వయసులోనే కన్నుమూశారు. గత ఏడాది కాలంగా తీవ్రమైన శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె 2026 జూలై 15న ముంబైలో నిద్రలోనే ప్రాణాలు విడిచారు. అయితే ఆమె కుటుంబ సభ్యులు దాదాపు నెల రోజుల తర్వాత, ఆగస్టు 16న ఈ విచారకరమైన వార్తను అధికారికంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. 1998 ఆగస్టు 10న జన్మించిన అనన్య.. హిందీలో ‘ఘోస్ట్’ (Ghost), ‘7 అవర్స్ టు గో’, ‘ది ఫైనల్ ఎగ్జిట్’ వంటి చిత్రాలతో పాటు, తెలుగులో డైరెక్టర్ శ్రీనివాసరాజు తెరకెక్కించిన ‘తగ్గేదే లే’ (2022) సినిమాలో కూడా కీలక పాత్ర పోషించి గుర్తింపు తెచ్చుకున్నారు.
అయితే చివరి సోషల్ మీడియా పోస్ట్‌లో ఇక నేను వెలిగిపోయే సమయం వచ్చింది అని రాసిన యువ నటి.. కొద్ది రోజులకే ఈ లోకాన్ని విడిచి పెట్టడంతో అభిమానుల హృదయాలను కలిచివేస్తున్నాయి. బాలీవుడ్, తెలుగు చిత్రాల్లో నటించిన నటి, మోడల్ అనన్య రాజ్ మరణ వార్త నెల రోజుల తర్వాత బయటకు రావడంతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. 27 ఏళ్ల అనన్య రాజ్ 2026 జూలై 15 తెల్లవారుజామున నిద్రలోనే ప్రశాంతంగా కన్నుమూసినట్లు ఆమె కుటుంబ సభ్యులు ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని వెంటనే బయటపెట్టకుండా, నెల రోజుల పాటు గోప్యంగా ఉంచడం మరింత చర్చకు దారితీసింది. ఇదే సమయంలో ఆమె అంత్యక్రియలను కూడా కుటుంబ సభ్యులు చాలా గోప్యంగా నిర్వహించారు.
Also Read
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
కుటుంబ సభ్యులు చెబుతున్న వివరాల ప్రకారం, గత ఏడాది కాలంగా అనన్య శారీరక, మానసిక సమస్యలతో పోరాడుతున్నారు. ఆమె ధైర్యంగా అన్ని కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ చివరకు నిద్రలోనే తుదిశ్వాస విడిచారని వారు పేర్కొన్నారు. అయితే ఆమె మరణానికి గల ఖచ్చితమైన కారణాన్ని కుటుంబం వెల్లడించలేదు. అనన్య చివరి సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మే 17న షూటింగ్ సెట్లో తీసుకున్న ఫొటోను పంచుకుంటూ ఇక నేను వెలిగిపోయే సమయం వచ్చింది అని క్యాప్షన్ రాశారు. అదే ఆమె చివరి పోస్ట్ కావడంతో అభిమానులు ఆ మాటలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురవుతున్నారు. సోషల్ మీడియాలో దాదాపు లక్షన్నర మంది ఫాలోవర్లను సంపాదించుకున్న అనన్య మరణ వార్త బయటకు వచ్చిన తర్వాత సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. చిన్న వయసులోనే ఆమె సినీ ప్రయాణం ముగియడం అందరినీ కలిచివేస్తోంది.
- Tags
- Ananya Raj
- cinema
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..