Allu Arjun – Atlee: బన్నీ కోసం డిజాస్టర్ హీరోయిన్?

Allu Arjun Atlee

Allu Arjun Atlee

పుష్ప లాంటి వరుసగా రెండు బ్లాక్‌బస్టర్ హిట్ సిరీస్‌ల తర్వాత, ఇప్పుడు అల్లు అర్జున్ దర్శకుడు అట్లీ డైరెక్షన్‌లో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ముంబైలో నిశ్శబ్దంగా ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

Read More: Puri – Sethupathi: అబ్బే ఆ హీరోయిన్లు సినిమాలో లేరట!

ఇప్పటికే ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్‌లకు అవకాశం ఉందని ఒక వార్త వెలుగులోకి వచ్చింది. అందులో ముగ్గురు అల్లు అర్జున్ సరసన నటించనుండగా, మరో ఇద్దరు సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో మృణాళ్ ఠాకూర్ ఒక హీరోయిన్‌గా ఎంపికైంది, దానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. అలాగే, దీపికా పదుకొణెను కూడా ఈ సినిమాలో తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది, కానీ అది ఇంకా ఖరారు కాలేదు.

Read More:Pushpa 2: డిశ్చార్జ్ కానున్న సంధ్య థియేటర్ ఘటన బాధితుడు శ్రీ తేజ్

తాజా సమాచారం ప్రకారం, డిజాస్టర్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న అనన్యా పాండేను ఈ సినిమా కోసం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సినీ పరిశ్రమలో జరుగుతున్న ప్రచారం మేరకు, ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడు. అట్లీ డైరెక్షన్‌లో సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. సుమారు ₹600 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి అల్లు అర్జున్ మరియు అట్లీ కలిసి ₹250 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోనున్నారు. అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి అనేక వార్తలు తెరపైకి వస్తూనే ఉన్నాయి.