Chand Mera Dil: అనన్యా పాండే మూవీకి సెన్సార్ షాక్..10 సెకన్ల కిస్ సీన్ డిలీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివేక్ సోని దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మించిన ‘చంద్ మేరా దిల్’ చిత్రం పక్కా యూత్‌ఫుల్, రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కింది.యువ నటుడు లక్ష్య (Lakshya), బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్యా పాండే (Ananya Panday) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ట్రైలర్లో లక్ష్య – అనన్యా పాండే మధ్య కెమిస్ట్రీ చూసి ఆడియన్స్ ఫిదా అయ్యారు. అయితే, ఈ సినిమాలో రొమాన్స్ డోస్ శృతిమించిందంటూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో..
థియేటర్లలో ఫ్యామిలీ ఆడియన్స్ కు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చిత్రంలోని పలు ఘాటైన సీన్లపై సెన్సార్ సభ్యులు పెద్ద కత్తెరే వేశారు. ఈ మార్పుల అనంతరం చిత్రానికి UA 16+ సర్టిఫికేట్‌ను ఖరారు చేశారు. ప్రముఖ బాలీవుడ్ మీడియా సంస్థల కథనం ప్రకారం.. సినిమాలో కథా గమనంలో వచ్చే అత్యంత సన్నిహిత దృశ్యాలను, లిప్-లాక్ సీన్లను సెన్సార్ బోర్డ్ నిశితంగా పరిశీలించి ఈ కింది మార్పులను ఆదేశించింది.. ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే ఒక 10 సెకన్ల సుదీర్ఘమైన ముద్దు సీక్వెన్స్‌ను బోర్డు పూర్తిగా తొలగించి, దాని స్థానంలో కథకు ఇబ్బంది లేకుండా ఉండే వేరే ప్రత్యామ్నాయ (Alternative) విజువల్స్ ఉంచాలని స్పష్టం చేసింది. దీనితో పాటు వేర్వేరు సందర్భాల్లో వచ్చే దాదాపు 1 నిమిషం 26 సెకన్ల నిడివి గల మరికొన్ని ఘాటైన లిప్-లాక్ సీన్లను కూడా కత్తిరించారు. మొత్తంగా చూసుకుంటే దాదాపు 96 సెకన్ల రొమాంటిక్ కంటెంట్‌కు సెన్సార్ బోర్డ్ చెక్ పెట్టింది. కాగా ఈ భారీ సెన్సార్ కట్స్ ఎడిట్ల అనంతరం సినిమా నిడివి మరింత తగ్గింది. అన్ని మార్పులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మొత్తం 135.36 నిమిషాల (సుమారు 2 గంటల 15 నిమిషాల) పర్ఫెక్ట్ రన్టైమ్తో థియేటర్లలోకి రానుంది.
Also Read
తాజావార్తలు
-
Chand Mera Dil: అనన్యా పాండే మూవీకి సెన్సార్ షాక్..10 సెకన్ల కిస్ సీన్ డిలీట్
-
Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
-
IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
-
Ruturaj Gaikwad-CSK: ఓడినా ఎంతో గర్వంగా ఉంది.. వచ్చే ఏడాది మరింత బలంగా వస్తాం!
-
Tollywood : అటు నందమూరి.. ఇటు మెగా.. ముహూర్తం పెట్టేసారు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!