Site icon NTV Telugu

Tollywood : ప్లాప్ సినిమాకు అవార్డు.. అమ్మడి ఆశలన్నీ ఆ సినిమాపైనే

Bhagya Sree

Bhagya Sree

అందం,అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాకపోవడంతో వరుస ఫెయిల్యూర్స్ చూస్తోంది భాగ్యశ్రీ బోర్సే. నార్త్ బెల్ట్ నుండి ఊడిపడిన ఈ చందమామ.. మిస్టర్ బచ్చన్‌లో అందాలు ఆరబోసినా లక్‌ కలిసి రాలేదు. విజయ్ దేవరకొండ కింగ్డమ్‌తో ఆదుకుంటాడు అనుకుంటే.. ఈ క్వీన్‌కు పర్‌ఫార్మెన్స్‌కి స్కోప్ లేని క్యారెక్టర్‌ చేయడంతో అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీ కూడా బ్రేక్ ఈవెన్ కాలేదు.  భాగ్యశ్రీ నటించిన నెక్ట్స్ సినిమా కాంత. సినిమా కథ పీరియాడిక్ డ్రామా అయినప్పటికీ.. టైటిల్‌ జస్టిఫై చేసేలా తన క్యారెక్టర్‌తో ఆకట్టుకోగలిగితే.. భాగ్యశ్రీ ప్లాప్స్ నుండి గట్టెక్కే అవకాశం ఉంది.

Also Read : Rukmini Vasanth : రుక్మిణి వసంత్ ను ఆ ఇద్దరు హీరోలే ఆదుకోవాలి

కానీ ఇటీవల దుబాయ్ లో జరిగిన సైమా అవార్డ్స్ లో బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ గా భాగ్య శ్రీ బోర్స్ అవార్డు అందుకుంది. అసలు ఈ అవార్డు కెలవం ఆమె అందాల ఆరబోతకు మాత్రమే ఇచ్చారనుకోవాలి. ఎందుకు అసలు మిస్టర్ బచ్చన్ లో ఆమె చేసేందుకు ఏముండదు. రొటీన్ రెగ్యులర్ సినిమాలలో ఉండే హీరోయిన్ పాత్ర తప్ప అంతగా చెప్పుకోవడానికి ఏమి లేని పాత్ర. కానీ ఆ పాత్రకు కూడా అవార్డు దక్కించడం ఏమిటో. ఆ సంగతి అలా ఉంచితే ఇటివల భాగ్యశ్రీ నటించిన కింగ్డమ్ లో కూడా భాగ్యశ్రీ పాత్ర గురించి ఎంత తక్కువ మాట్లాడితేత్ అంత మంచిదనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఈ భామ హోప్స్ అన్ని రామ్ పోతినేనితో చేస్తున్న ఆంధ్రా కింగ్ తాలూకా. ఈ సినిమాతో హిట్ కొట్టి ట్రాక్ లోకి రావాలని చూస్తోంది. ఇది కూడా అటు ఇటు అయితే భాగ్యశ్రీ ఇక్కడ దుకాణం సర్దుకోవాల్సిందే.

 

Exit mobile version