Site icon NTV Telugu

Ranveer Singh-Dhurandhar: ‘ధురంధర్’ తుఫాను మధ్య.. రణవీర్ రొమాంటిక్ కామెడీ మూవీ వచ్చేస్తోంది!

Band Baaja Baaraat Re Release

Band Baaja Baaraat Re Release

బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ చిత్రం ‘ధురంధర్’ 2025 డిసెంబర్ 5న విడుదలైంది. సినిమా రిలీజై దాదాపు నెల రోజులు కావొస్తున్నా.. ధురంధర్ మేనియా కంటిన్యూ అవుతోంది. నాల్గవ వారంలో భారీ వసూళ్లను కలెక్ట్ చేసింది. ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లు వసూళ్లను దాటింది. ఈ మూవీ సీక్వెల్ మార్చి 19న రిలీజ్ కాబోతోంది. అయితే బాలీవుడ్‌లో ధురంధర్ తుఫాను మధ్య రణవీర్ నటించిన ఓ రొమాంటిక్ కామెడీ సినిమా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.

Also Read: Realme 16 Pro 5G Launch: రియల్‌మీ ‘బాహుబలి’ ఫోన్ వచ్చేస్తోంది.. 2 రోజుల పాటు ఛార్జర్‌ అవసరం లేదు!

రణ్‌వీర్ సింగ్ తొలి చిత్రం ‘బ్యాండ్ బాజా బారాత్’ థియేటర్లలో రీ-రిలీజ్ కానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ హంగామా నివేదిక ప్రకారం.. జనవరి 16న విడుదల కానుంది. ఓవైపు ధురంధర్ బ్లాక్ బస్టర్ హిట్, మరోవైపు బ్యాండ్ బాజా బారాత్ సినిమాకు 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారట. పీవీఆర్ ఐనాక్స్ సహకారంతో యష్ రాజ్ ఫిల్మ్స్ రీ-రిలీజ్ చేస్తోందని సమాచారం. మనీష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుష్క శర్మ ప్రధాన పాత్రలో నటించారు. 2010లో విడుదలైన బ్యాండ్ బాజా బారాత్ మూవీ రొమాంటిక్ కామెడీలలో ఒకటిగా నిలిచింది. రణవీర్, అనుష్కల కెమిస్ట్రీని అందరూ ఎంజాయ్ చేశారు.

Exit mobile version