బాలీవుడ్ స్టార్ బ్యూటీ అమీశా పటేల్ గురించి పరిచయం అక్కర్లేదు. నార్త్ ఇండియా హీరోయిన్లలో తన ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అమీశా, బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమల్లోనూ విభిన్న పాత్రలతో మెప్పించడమే కాక, స్టార్ హీరోలకు జోడీగా నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘బద్రి’, మహేశ్ బాబు సరసన ‘నాని’, తారక్ సరసన ‘నరసింహుడు’, చివరగా ‘గద్దర్ 2’ వంటి బ్లాక్ బస్టర్ హిట్లలో.. 25 ఏళ్ల కెరీర్‌లో ఆమె 40కు పైగా సినిమాల్లో నటించి, విభిన్న షైల్స్‌లో తన ప్రతిభను చూపించింది. అయితే తాజాగా, అమీశా సెలెబ్రిటీ క్రష్ గురించి చర్చిస్తూ అభిమానులకు షాక్ ఇచ్చింది.
Also Read : The Raja Saab : దసరా పండుగకు గ్రాండ్ ట్రీట్ రెడీ చేస్తున్న ‘రాజా సాబ్’.. ?
ఇంటర్వ్యూలో అమీశా.. హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ పై నా క్రష్‌ను నిర్మోహమాటంగా వెల్లడించారు.. ‘నాకు టామ్ క్రూజ్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. నా పెన్సిల్ బాక్స్‌లో, నా ఫైల్స్‌లో, గదిలో కూడా టామ్ క్రూజ్ ఫోటోలు ఉండేవి. అతనిని చూసినప్పుడు నా జీవితంలో రూల్స్ అన్నీ పక్కన పెట్టాల్సి వస్తుంది. ఒక రాత్రి ఆయనతో గడపగలరా? అని అడిగితే, ఎలాంటి సందేహం లేకుండా సరే అంటాను” అంటూ అమీశా ఫన్నీగా కామెంట్స్ చేసింది. కానీ ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.