Raaka : అప్పుడే.. ర్యాంపేజ్ షురూ చేసిన అల్లు అర్జున్ ‘రాకా’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ చిత్రంతో ఆయన మార్కెట్ కేవలం దక్షిణాదికే పరిమితం కాకుండా, నార్త్ ఇండియాలోనూ తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుంది. ముఖ్యంగా పుష్ప-2 విడుదల సమయంలో బీహార్‌లో నిర్వహించిన గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన రెస్పాన్స్ అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఆ తర్వాత బాలీవుడ్‌తో పాటు.. బీహార్లోను దుమ్ముదులిపేసింది పుష్ప2.
దీంతో ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న రాకా చిత్రానికి అక్కడ భారీ పోటి నెలకొన్నట్టుగా తెలుస్తోంది. డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రాకా’ మూవీపై బాలీవుడ్ ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప సిరీస్‌తో వచ్చిన ఇమేజ్ను దృష్టిలో ఉంచుకుని, ఈ సినిమా హక్కుల కోసం నార్త్ డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటి నుంచే క్యూ కడుతున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, హిందీ బెల్ట్‌లో ఈ సినిమా బిజినెస్ ఓ రేంజ్లో జరుగుతుందని అంచనా వేస్తున్నారు. కానీ, బీహార్‌లో మాత్రం ‘రాకా’ చిత్ర హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్ల మధ్య గట్టి పోటీ ఏర్పడిందట. అక్కడి ప్రముఖ పంపిణీదారులు ఈ సినిమా హక్కులను దక్కించుకోవడానికి, భారీ ధర చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు డిస్ట్రిబ్యూటర్లు ఈ విషయమై చిత్ర నిర్మాతలను సంప్రదించినట్లు తెలుస్తోంది. దీంతో.. పుష్ప తరహాలోనే ఈ సినిమా కూడా నార్త్ ఇండియాలో భారీ వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. మరి రాకా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్‌లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్‌లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్‌లో లాంచ్..!