Allu Arjun : పుష్ప – 2 కోసం తమన్ ను ఎందుకు తీసుకున్నారు..?
- పుష్ప కు సీక్వెల్ గా వస్తున్న పుష్ప -2
- కేవలం సాంగ్స్ కు మాత్రమే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం
- టాలీవుడ్ లో తీవ్ర చర్చనియాంశం గా పుష్ప - వ్యవహారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప ది రూల్. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలోని శ్రీలీల, బన్నీ పై వచ్చే స్పెషల్ సాంగ్ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. మరో నాలుగు రోజులు పాటు ఈ షూట్ జరగనుంది. త్వరలోనే ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను రిలిజ్ చేయనున్నారు మేకర్స్.
Also Read : Kiran Abbavaram : ‘క’ ఓటీటీ రిలీజ్ పై వాళ్లు అలా.. నిర్మాత ఇలా..
Also Read
కాగా ఈ సినిమా విషయంలో ఇప్పుడు దర్శకుడు సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ మధ్య మనస్పర్ధలు తలెత్తినట్టు తెలుస్తోంది. వివరాలలోకెళితే పుష్ప -2 బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కోసం దేవిశ్రీని తప్పించి మరో సంగీత దర్శకుడిని తీసుకున్నారు మేకర్స్. అతడే టాలీవుడ్ సెన్సేషన్ SS.థమన్. రాబోతున్న పుష్ప -2 కు ఈయనే బీజీమ్ అందిస్తున్నారు. సాధారణంగా సుకుమార్ సినిమాలు అంటే దేవిశ్రీ తప్ప మరొక పేరు వినిపించదు. తోలి సినిమా ఆర్య నుండి మొన్న వచ్చిన పుష్ప పార్ట్ – 1 వరకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కానీ మొదటి సారి సుక్కు దేవిని పక్కన పెట్టి వేరే సంగీత దర్శకులను తీసుకోవడం టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశం గా మారింది. దేవిశ్రీ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వర్క్ పట్ల సుకుమార్ సంతృత్తి చెందలేదని అందుకే తమన్ ను తీసుకువచ్చారని టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో సినిమా స్థాయిని వేరే లెవల్ కు చేర్చే తమన్ ఇప్పుడు ఈ పాన్ ఇండియా మూవీకి ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
INDW vs AUSW: గ్రూప్-ఏలో ఉత్కంఠభరిత పోటీ.. భారత్ సెమీస్ చేరాలంటే అద్భుతమే జరగాలి!
-
Hanuman: హనుమంతుడిని కూడా నిలువరించిన ముగ్గురు యోధులు వీరేనా? ఈ కథల వెనుక ఉన్న విశేషాలేంటి?
-
DUBAI: గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ సర్వనాశనం.. దుబాయ్‌ను నిండా ముంచేసిన ఇరాన్!
-
Karnataka: “నిన్ను చంపి నేను చస్తా”.. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్‌చేస్తే..
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!