టాలీవుడ్‌లో గత కొంతకాలంగా మెగా మరియు అల్లు ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ ఉందో లేదో తెలియదు కానీ అది ఉందని మాత్రం సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, వాటన్నింటికీ చెక్ పెడుతూ తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. మరోవైపు అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో బన్నీ స్వయంగా చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయన ఆశీర్వాదాలు తీసుకోవడం మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి భేదభావాలు లేవని చెప్పేందుకే ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది.
Also Read:Draupathi 2 : తుగ్లక్ పాత్రలో చిరాగ్ జానీ విశ్వరూపం.. ‘ద్రౌపది 2’ పై పెరిగిన భారీ అంచనాలు!
కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ చేస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో ఎన్టీఆర్ చేయాల్సి ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా, ఇప్పుడు అల్లు అర్జున్ చేతికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ‘జులాయి’, ‘S/O సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న నాలుగో సినిమా కావడంతో దీనిపై భారీ హైప్ నెలకొంది. చిరంజీవి-అల్లు అర్జున్ కలయికకు సంబంధించిన ఫోటోలు బయటకు రాకపోయినప్పటికీ, ఈ వార్త మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది.
విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలకు ఇది పూర్తిస్థాయిలో ఫుల్‌స్టాప్ పెడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. చిరంజీవి సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’ విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ భేటీ సినిమాకు కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.