Allu Arjun: చొక్కా నలగకుండా 500 కోట్లు కొట్టడం ఆయనకే సాధ్యం: ‘జైలర్ 2’పై అల్లు అర్జున్ క్రేజీ రివ్యూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun: బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ మేనియా మరోసారి మామూలుగా లేదు. రీసెంట్గా థియేటర్లలోకి వచ్చిన ‘జైలర్ 2’ రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుండగా, తాజాగా ఈ చిత్రంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇచ్చిన రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ముఖ్యంగా రజనీకాంత్ స్టైల్, బాక్సాఫీస్ స్టామినా గురించి బన్నీ వాడిన పంచ్ లైన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను చూసిన అనంతరం అల్లు అర్జున్ ‘జైలర్ 2’ టీమ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. “రజనీకాంత్ సార్ స్టార్ పవర్, ఆయన స్వాగ్, ఆరా ఏంటో ఈ సినిమా మరోసారి చూపించింది. ఒంట్లో అడ్రినలిన్ రష్ పెంచే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది” అని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఇక సినిమాకు ప్రాణం పోసిన రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్‌పై స్పందిస్తూ.. “బ్రదర్ అనిరుధ్.. మ్యూజిక్‌తో రచ్చ లేపేశావ్” అంటూ కొనియాడారు.
దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ టేకింగ్‌ను ఆకాశానికెత్తుతూ.. “షోమ్యాన్ నెల్సన్ గారు ఈసారి అదిరిపోయే బ్లాక్‌బస్టర్ హిట్‌ను డెలివర్ చేశారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాత.. అందరూ తమ మనసు పెట్టి ఈ సినిమా కోసం పనిచేశారు” అంటూ మొత్తం టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే బన్నీ చేసిన ట్వీట్లో అందరినీ విపరీతంగా ఆకర్షించింది మాత్రం కలెక్షన్లపై ఆయన వేసిన పవర్ఫుల్ పంచ్. “చొక్కా నలగకుండా 500 కోట్లకు పైగా వసూళ్లు కొట్టడం ఒక్క రజినీకాంత్ గారికే సాధ్యం” అంటూ అల్లు అర్జున్ రాసుకొచ్చారు. రజనీ బాక్సాఫీస్ స్టామినాను ఇంత సింపుల్‌గా, అంత పవర్‌ఫుల్‌గా ఎలివేట్ చేయడం రజినీ అభిమానులందరినీ మెప్పిస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పోస్ట్ చేసిన ఈ జైలర్ 2 మూవీ రివ్యూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
Also Read
- Teja Sajja: డిసెంబర్లో పెళ్లి.. అమ్మాయి ఎవరో క్లారిటీ ఇచ్చేసిన తేజ సజ్జ
- Dhanush - Aishwaryaa: ధనుష్ - ఐశ్వర్య మళ్లీ కలుస్తున్నారా? అనిరుధ్ పెళ్లి వేదికగా బిగ్ ట్విస్ట్!
- The Paradise: నెట్ ఫ్లిక్స్ లో ప్యారడైజ్.. ఆ సీన్స్ కట్
- Ranbir Kapoor: ట్రోలర్లకు స్వీట్ షాక్.. తనపై తానే జోక్ వేసుకొని నవ్వించిన రణ్‌బీర్ కపూర్!
#Jailer2 is 🔥🔥🔥
A true showcase of @rajinikanth sir’s star power, swag & aura! A Commercial Entertainer that keeps the adrenaline pumping!
Brother… @anirudhofficial KILLED IT! All the artists, technicians & the producer have poured their hearts into this film. The Showman @Nelsondilpkumar garu delivers the coolest hit with a BANG!
చొక్కా నలగకుండా 500 CR+ కొట్టడం ఒక్క రజినీ గారికే సాధ్యం! 🖤
Congratulations to the entire team! @sunpictures
— Allu Arjun (@alluarjun) October 22, 2026
తాజావార్తలు
-
Allu Arjun: చొక్కా నలగకుండా 500 కోట్లు కొట్టడం ఆయనకే సాధ్యం: ‘జైలర్ 2’పై అల్లు అర్జున్ క్రేజీ రివ్యూ!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Chikkadpally: యువతితో అసభ్య ప్రవర్తన.. ఘర్షణలో డీఆర్డీవో ఉద్యోగి మృతి
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!
-
AP LocalBody Elections : తూర్పుగోదావరిలో ఎన్నికల వేడి.. రెండో రోజు భారీగా నామినేషన్లు
ట్రెండింగ్
-
Home Remedies : తెల్ల సాక్సులపై నల్ల మరకలా? ఇలా సింపుల్ చిట్కాలతో వదిలించండి
-
Harry Brook: ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో హరీ బ్రూక్ విధ్వంసం..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP కెమెరా, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 లాంచ్..!
-
Home Cleaning : దీపావళి వేళ.. ఇంట్లో బల్లులు, బొద్దింకల బెడద ఎక్కువగా ఉందా? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Ind vs NZ: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.. 4 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు..!