AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..

Aa24

Aa24

AA24 Secret Out: పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద తనకంటూ ఒక తిరుగులేని సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అడుగులు ఇప్పుడు మరింత దూకుడుగా మారాయి. వరుస భారీ ప్రాజెక్టులతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న బన్నీ, ఇప్పుడు తన మైల్ స్టోన్ ఫిల్మ్ ‘#AA24’ కోసం ఎలాంటి జోనర్ ఎంచుకుంటారు? డైరెక్టర్ ఎవరు? అనే ప్రశ్నలు గత కొంతకాలంగా టాలీవుడ్‌ను ఊపేస్తున్నాయి. అయితే తాజాగా నెట్టింట ప్రత్యక్షమైన ఒకే ఒక్క ఫొటో సినీ ప్రియుల అనుమానాలను దాదాపు నిజం చేస్తూ, సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మలయాళ చిత్రసీమలో సూపర్ హీరో సబ్జెక్ట్‌తో ఇండియన్ సినిమా దృష్టిని తనవైపు తిప్పుకున్న ‘మిన్నల్ మురళి’ దర్శకుడు బాసిల్ జోసెఫ్. ఆయనతో కలిసి పలు సంచలన చిత్రాలకు కలం పట్టిన స్టార్ కో-రైటర్ అరుణ్ అనిరుధన్ తాజాగా పెట్టిన ఒక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో కార్చిచ్చు రేపింది. అల్లు అర్జున్‌కు అత్యంత ఇష్టమైన లగ్జరీ కార్ రేంజ్ రోవర్ ‘బీస్ట్’ వద్ద దిగిన ఫొటోను అరుణ్ పంచుకోవడమే ఇందుకు కారణం. బన్నీ సొంత వాహనం దగ్గర, ఆయన వ్యక్తిగత ప్రాంగణంలో ‘మిన్నల్ మురళి’ రైటర్ కనిపించడంతో నెటిజన్లు ఒక్కసారిగా డాట్స్ కనెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు.

కొంతకాలంగా అల్లు అర్జున్ – బాసిల్ జోసెఫ్ కాంబో ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుందంటూ ఫిలింనగర్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు బాసిల్ రైటింగ్ టీమ్ నేరుగా బన్నీ అడ్డాలోకి ఎంట్రీ ఇవ్వడంతో, కథా చర్చలు కేవలం మాటలకే పరిమితం కాలేదని.. తుది దశకు చేరిపోయాయని స్పష్టమవుతోంది. ఐకాన్ స్టార్ ఇమేజ్‌కు తగ్గట్టుగా బాసిల్ బృందం ఓ సరికొత్త కంటెంట్‌తో కూడిన విభిన్నమైన స్టోరీని రెడీ చేసిందని, గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అరుణ్ అనిరుధన్ లాంటి టాలెంటెడ్ రైటర్ పవర్ఫుల్ స్క్రిప్ట్, బాసిల్ జోసెఫ్ సరికొత్త నేరేషన్, వీటన్నింటికీ తోడు అల్లు అర్జున్ మాస్ అండ్ స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే థియేటర్లలో విధ్వంసం ఏ రేంజ్‌లో ఉంటుందో అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. కేవలం ఒకే ఒక్క ఇన్‌స్టా పిక్‌తో ‘#AA24’ హైప్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడితే ఇండియన్ సినీ చరిత్రలోనే మరో బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.