Site icon NTV Telugu

Allu Arjun: ‘పుష్ప’ నుంచి బయటకు రావాల్సిందే!

Allu Arjun

Allu Arjun

తెలుగు సినిమా పరిశ్రమలో ఐకాన్ స్టార్‌గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ ‘పుష్ప 2: ది రూల్’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల కలెక్షన్స్‌తో సంచలన విజయం సాధించాడు. ఇప్పుడు దర్శకుడు అట్లీతో కలిసి ‘AA22xA6’ అనే భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం, అల్లు అర్జున్‌ను సరికొత్త అవతారంలో చూపించనుంది. ‘పుష్ప’ సిరీస్‌లో రఫ్ అండ్ రగ్గడ్ లుక్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన అల్లు అర్జున్, ఈ సినిమా కోసం పూర్తిగా భిన్నమైన లుక్‌లో కనిపించనున్నాడు.

Also Read:Telusu Kada : అందరికీ తెలిసేలా చేప్పేది ఆరోజే!

సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ సహకారంతో అల్లు అర్జున్ తన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై దృష్టి సారించాడు. లాయిడ్ స్టీవెన్స్, గతంలో జూనియర్ ఎన్టీఆర్ (‘RRR’), మహేష్ బాబు, రణవీర్ సింగ్ వంటి స్టార్స్‌తో పనిచేశాడు. ‘AA22xA6’లో అల్లు అర్జున్ కేవలం ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తోనే కాకుండా, విభిన్నమైన హెయిర్ స్టైల్స్‌తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు. ఇటీవల ముంబైలో జరిగిన WAVES సమ్మిట్ 2025లో అల్లు అర్జున్ కొత్త హెయిర్ స్టైల్‌తో కనిపించాడు, ఇందులో అతను తన జుట్టును షార్ట్‌గా కట్ చేసి, బీర్డ్‌ను ట్రిమ్ చేసిన స్టైలిష్ లుక్‌లో కనిపించాడు.

Also Read:Rajendra Prasad: నేను ఇలానే మాట్లాడతా.. మీ కర్మ!

అయితే, ఇది ఫైనల్ లుక్ కాదని, సినిమా కోసం మరిన్ని వైవిధ్యమైన లుక్స్‌ను పరీక్షిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్‌లో కనిపించనున్నాడని, అందులో ఒక పాత్ర నెగటివ్ షేడ్స్‌తో ఉంటుందని ఇన్‌సైడ్ వర్గాలు తెలిపాయి. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘AA22xA6’ ఒక సై-ఫై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఇందులో పారలల్ యూనివర్స్ కాన్సెప్ట్‌తో పాటు అత్యాధునిక VFX ఉంటాయని తెలుస్తోంది.త్రం రూ. 600-700 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమవుతున్న భారీ ప్రాజెక్ట్ కావడంతో అల్లు అర్జున్ అభిమానులు ఈ కొత్త లుక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

Exit mobile version