Rajendra Prasad: నేను ఇలానే మాట్లాడతా.. మీ కర్మ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినిమా పరిశ్రమలో కామెడీ కింగ్‌గా, సీనియర్ నటుడిగా గుర్తింపు పొందిన రాజేంద్ర ప్రసాద్ ఇటీవల వివాదాల్లో చిక్కుకున్నారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో కమెడియన్ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయన, ఈ విషయంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో, జూన్ 2, 2025న జరిగిన తన తాజా చిత్రం ‘షష్టిపూర్తి’ సక్సెస్ మీట్‌లో ఈ వివాదంపై రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. ఆయన స్పందన మరింత చర్చనీయాంశంగా మారింది.
Also Read:Nayanthara : రూ.100 కోట్లు ఇచ్చినా ఆ హీరోతో నటించను.. తేల్చి చెప్పిన నయనతార
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
ఎస్వీ కృష్ణారెడ్డి జన్మదిన వేడుకల్లో రాజేంద్ర ప్రసాద్, కమెడియన్ అలీని అనుచిత పదజాలంతో సంబోధిస్తూ, “వీడు ఎక్కడ లం****కు.. బుద్ధి ఉందా లేదా..? ఎన్టీఆర్ గారి అవార్డు అంటే చప్పట్లు కొట్టరా..?” అంటూ వ్యాఖ్యానించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రాజేంద్ర ప్రసాద్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో కూడా ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్న రాజేంద్ర ప్రసాద్, ఆ సంఘటన కోసం క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలతో ఆయన వివాదంలో చిక్కుకున్నారు.
Also Read:Arya 3: దిల్ వారసుడి కోసం ‘ఆర్య 3’ రెడీ
‘షష్టిపూర్తి’ సినిమా సక్సెస్ మీట్‌లో ఈ వివాదంపై మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్, తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ మరింత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “ఈ మధ్య కొన్ని ఫంక్షన్స్‌లో నేను మాట్లాడుతుంటే, గబుక్కున దాన్ని రాంగ్‌గా అర్థం చేసుకుంటున్నారు. అది మీ ఖర్మ, మీ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. నేనేం చేయలేను. ఒకవేళ తప్పుగా అర్థం చేసుకుని ఉంటే, అది మీ సంస్కారం. నేనైతే ఇలానే ఉంటా,” అని ఆయన అన్నారు. అంతేకాకుండా, “నేను ఎప్పుడూ మీడియాను మీడియా అని పిలవను, నా ఫ్యామిలీ అని పిలుస్తాను. మీ అందరూ నన్ను అన్నయ్య అని పిలవడమే నా జన్మ ధన్యం, నా అదృష్టం. ఈ మధ్య నేను ఇంట్రడ్యూస్ చేసిన హీరోయిన్, నేను తీసుకొచ్చిన యాక్టర్లతో సరదాగా ఉంటే, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నట్టు ఉన్నారు. అది మీ ఖర్మ,” అని వ్యాఖ్యానించారు. రాజేంద్ర ప్రసాద్ వంటి సీనియర్ నటుడు వరుస వివాదాల్లో చిక్కుకోవడం ఆయన అభిమానులను నిరాశపరుస్తోంది. ‘షష్టిపూర్తి’ సక్సెస్ మీట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు, క్షమాపణ చెప్పకుండా వివాదాన్ని సమర్థించుకోవడం మరింత చర్చనీయాంశమైంది.
తాజావార్తలు
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!