అల్లు అరవింద్ తన తల్లి అల్లు కనకరత్నం మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ రోజు అల్లు కనకరత్నం దశదిన కర్మను హైదరాబాద్‌లో నిర్వహించారు. అల్లు అరవింద్ దుఃఖంలో ఉండగా, ఆయనను పరామర్శించేందుకు సినీ పెద్దలు, ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అదే విధంగా, రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు సైతం అల్లు అరవింద్ నివాసానికి వెళ్లి సంతాపం వ్యక్తం చేశారు.
Also Read:Malayalam Actresses: టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్న మల్లు భామలు?
అయితే, మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి అల్లు కనకరత్నం దశదిన కర్మకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అల్లు అరవింద్‌కు తన సంతాపం వ్యక్తం చేశారు. నిజానికి, అల్లు కనకరత్నం చనిపోయిన సమయంలో అల్లు అరవింద్ అందుబాటులో లేరు. దీంతో, మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఆమె భౌతికకాయం వద్దకు వెళ్లి అంత్యక్రియల ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు. ఇక తాజాగా, చిరంజీవి అల్లు ఫ్యామిలీతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో అల్లు అరవింద్‌తో పాటు అల్లు అర్జున్, అల్లు శిరీష్‌తో పాటుగా వారి తల్లి కూడా కనిపిస్తున్నారు.
