Allu Aravind Dances: ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కి తెలిసినంతగా సినిమా వ్యాపారం మరే నిర్మాతకు తెలియదనే చెప్పాలి. ఆయన చేసే ప్రసంగాలు కూడా తను చేసే సినిమాలకు ఎలివేషన్ గా ఉంటుంటాయి. అంతే కాదు సమయానుకూలంగా ఆ యా సినిమాల్లో నటించే నటీనటులను కూడా హైలేట్ చేస్తూ వారిని తన సొంత మనుషులు అనే భావనకు గురి చేస్తుంటాయి. అందుకు తాజా ఉదాహరణ తమ గీతా ఆర్ట్స్2 ద్వారా ఇటీవల విడుదలైన ’18 పేజెస్’ సినిమా ప్రచారంలో ఆయన ప్రసంగం. ఇక ఈ సినిమా ప్రచారంలో భాగంగా అందులో హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ తన కూతురిలాంటిదని మెగా ప్రొడ్యూసర్ ఒకటికి రెండు సార్లు వెల్లడించారు.
Read also: Michael: విజయ్ సేతుపతి టచ్ అయినా సందీప్ కి కలసి వస్తుందా!?
అంతే కాదు తనకు కూతురు పుడితే అనుపమ లాగా ఉంటుందన్నారు. ఇదే సినిమా మరో ఈవెంట్ లో అల్లు అరవింద్ తన కూతురు అనుపమ అక్కడికి రాలేదని వ్యాఖ్యానించినపుడు ఈవెంట్ లో ఉన్న పలువురు అనుపమ ఫ్యాన్స్ అరవింద్ ను ‘మామయ్యా, మామయ్యా…’ అంటూ ఆటపట్టించటంతో ఆడిటోరియం మొత్తం నవ్వులమయమైంది. దీనిమీద సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వెల్లువెత్తాయి. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత మిక్స్ డ్ రెస్పాన్స్ తో ప్రదర్శితం అవుతోంది. గీతాఆర్ట్స్ ద్వారా ఇటీవల కాలంలో రిలీజ్ అయిన స్ర్టెయిట్ సినిమాలకు ఎందుకో ఏమో అంత ఆదరణ లభించటం లేదు. మరి ’18 పేజెస్’ కూడా ఆ లిస్ట్ లో చేరుతుందా? లేక గట్టెక్కుతుందా? అన్నది తేలాల్సి ఉంది.