Allu Aravind : సింగిల్ సినిమా వసూళ్లలో కొంత భాగం సైనికులకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో హోల్సమ్ ఎంటర్టైనర్ #సింగిల్‌తో అలరించబోతున్నారు. ఈ చిత్రంలో కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ పాటలు సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఇక ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సింగిల్ సినిమా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది. ఈ చిత్రం తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద కూడా గణనీయమైన వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.
Read More : Chiru Anil: చిరు- అనిల్ సినిమా షూటింగ్ ఆరోజు నుండే!
Also Read
- Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
- Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
- Peddi - Irumudi: 'పెద్ది' ఓడిపోయింది.. 'ఇరుముడి' గెలవలేకపోయింది!
- Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. అగ్ర నిర్మాతగా, గీతా ఆర్ట్స్ వ్యవస్థాపకుడిగా పేరొందిన అల్లు అరవింద్, సింగిల్ సినిమా సక్సెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలు సినీ ప్రేమికులతో పాటు దేశభక్తుల హృదయాలను కూడా ఆకర్షించాయి. సక్సెస్ మీట్లో మాట్లాడుతూ అల్లు అరవింద్, “భారత్ మాతా కీ జై” అని గట్టిగా నినదించి, దేశం పట్ల తమ బాధ్యతను చాటిచెప్పారు. “మా సపోర్ట్ ఎప్పుడూ మన సైనికులకే ఉంటుంది. వారి త్యాగం, ధైర్యం మన దేశ భద్రతకు రక్షణ కవచంలా నిలుస్తాయి,” అని ఆయన ఉద్వేగంతో అన్నారు. ఈ వ్యాఖ్యలు సభలో ఉన్న ప్రేక్షకుల నుంచి భారీ చప్పట్లను రాబట్టాయి.
Read More : Nayanathara: అబ్బే.. నయనతార రెమ్యునరేషన్ వార్తలు అన్నీ ఫేక్?
ఈ సందర్భంగా అల్లు అరవింద్ మరో కీలక ప్రకటన చేశారు. సింగిల్ సినిమా వసూళ్ల నుంచి వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని భారత సైనికుల సంక్షేమం కోసం విరాళంగా అందించనున్నట్లు వెల్లడించారు. “మన సైనికులు దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్నారు. వారికి మనం ఏదో ఒక రూపంలో సాయం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. సింగిల్ సినిమా విజయం సాధించిన సందర్భంగా, మేము ఈ చిన్న సాయం చేయాలని నిర్ణయించాము,” అని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!