హాలీవుడ్ ఎంట్రీపై అలియా ఆశలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఇప్పుడు హాలీవుడ్ పై కన్నేసింది. అవకాశాల కోసం ఆమె ఓ ఏజెన్సీ ద్వారా ప్రయత్నాలు కూడా చేస్తోంది. ఈ మేరకు అలియా భట్ ప్రముఖ అంతర్జాతీయ టాలెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ‘డబ్ల్యూఎంఇ’తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ టాప్ ఏజెన్సీ ద్వారానే టాలెంటెడ్ బ్యూటీ ఫ్రీడా పింటో… హాలీవుడ్ మూవీస్ ‘రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’, ‘ఇమ్మోర్టల్స్’ చిత్రాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం అలియా కూడా అదే బాటలో పయనించాలని సన్నాహాలు చేస్తోంది. డబ్ల్యూఎంఇతో చేతులు కలిపిన అలియా ప్రస్తుతం హాలీవుడ్ అవకాశాల కోసం ఎదురు చూస్తోంది.
Read Also : పూజా తదుపరి ప్రాజెక్ట్ కు షాకింగ్ రెమ్యూనరేషన్…!!
Also Read
ఇటీవల కాలంలో ఉడ్తా పంజాబ్, గల్లీ బాయ్ లాంటి చిత్రాలతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్న ఆ అమ్మడు ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ ‘గంగూబాయి కతియావాడి’తో థియేటర్లలోకి రానుంది. బాలీవుడ్ లో సత్తా చాటిన అలియా ఇప్పుడు తన టాలెంట్ తో హాలీవుడ్ ప్రేక్షకుల మనసు కూడా దోచుకుని ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే లాంటి హీరోయిన్ల జాబితాలో చేరడానికి సిద్ధమవుతోంది. అలియా ఇప్పటివరకు నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను దక్కించుకుంది. ఇటీవల ఆమె నటించిన ‘గల్లీ బాయ్’ చిత్రానికి ఉత్తమ నటి అవార్డు దక్కించుకుంది. ఈ ఏడాది చివర్లో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉన్న చిత్రాలతో సహా అలియా తన కిట్టిలోని పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. బ్రహ్మస్త్రా, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో నటిగా, ఓ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తూ చాలా బిజీగా ఉంది.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్‌డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!