పూజా తదుపరి ప్రాజెక్ట్ కు షాకింగ్ రెమ్యూనరేషన్…!!

బుట్టబొమ్మ పూజాహెగ్డే ప్రస్తుతం ఇండియాలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఆమె కెరీర్ నడుస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ బ్యూటీకి భారీ క్రేజ్ ఉంది. ప్రస్తుతం పూజాహెగ్డే ప్రభాస్ తో రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్”లో, తలపతి విజయ్ సరసన “బీస్ట్” లో నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్ లోనూ ఈ అమ్మడి కిట్టీలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. మరి ఇంత క్రేజ్ ఉన్న ఆ భామ రెమ్యూనిరేషన్ తక్కువగా ఉంటుందా? అది కూడా భారీగానే ఉంది. కానీ తన నెక్స్ట్ మూవీకి పూజాహెగ్డే షాకింగ్ రెమ్యూనరేషన్ కోరుతుందనేది తాజా అప్డేట్.

Read Also : ఈషా డియోల్ రిటర్న్స్… డిజిటల్ డెబ్యూకి హేమా మాలిని కూతురు సిద్ధం!

వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించబోయే నితిన్ చిత్రానికి ఆమె సైన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమాకు పూజ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి నిర్మాతలు ఏకంగా రూ.3.5 కోట్లు ఇచ్చారని తెలుస్తోంది. ఈ వార్తలు గనుక నిజమైతే దక్షిణాదిన భారీ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో పూజాహెగ్డే కూడా చేరిపోతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి సౌత్ లో యూత్ తో పాటు ఫ్యామిలీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. త్రివిక్రమ్, మహేష్ ప్రాజెక్ట్ లో కూడా పూజా పేరు విన్పిస్తోంది. స్టార్ హీరోలంతా వరుసగా ఆమెకే ఓటేస్తుండడంతో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా మారిపోయింది అమ్మడు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-