Akshay Kumar : అక్షయ్ బర్త్ డేకి.. అభిమానులకు మైండ్‌బ్లోయింగ్ సర్ప్రైజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్‌లో ఖిలాడీగా పేరుగాంచిన అక్షయ్ కుమార్ తన కెరీర్‌లో ఎన్నో హిట్ సినిమాలు అందించారు. 1987 లో వచ్చిన ‘ఆజ్’ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన, అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 38 ఏళ్లపాటు సినీ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. ఈ ప్రయాణంలో యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, సోషల్ మెసేజ్ వంటి అనేక విభిన్నమైన పాత్రలో నటించి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు.
Also Read : Teja Sajja : ఈ ఇద్దరు స్టార్‌లతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా డ్రీమ్: తేజా సజ్జా
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Pradeep Rawat : ఛత్రపతి, సై సినిమాల విలన్ మృతి?
- Anchor Charmila Exclusive Interview : హీరోయిన్ ఆఫర్'కి నో, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా..విజయవాడ ఆర్జే to టాలీవుడ్ సెన్సేషన్!
అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే.. ఆయన తన సమకాలికుల్లో ఏడాదికి ఎక్కువ సినిమాలు చేసిన హీరో. ఇతర స్టార్‌లు ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు మాత్రమే చేస్తుంటే, అక్షయ్ మాత్రం వరుసగా మూడో నాలుగు సినిమాలు చేయడం అలవాటు. ఈ వేగమే ఆయనను రికార్డు స్థాయిలో ముందుకు నడిపించింది. ఫలితంగా తక్కువ కాలంలోనే 200వ సినిమాకు చేరుకునే ఘనత సాధించారు. కాగా అక్షయ్ కుమార్ పుట్టినరోజు సెప్టెంబర్ 9. ఈ స్పెషల్ డేను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు అభిమానులకు మైండ్‌బ్లోయింగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అదేంటంటే ఆయన 200వ సినిమాను ఈ సందర్భంగా అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఈ సందర్భం కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేస్తున్నారట. ఈ 200వ సినిమా ఎలాంటి కాన్సెప్ట్‌తో ఉంటుందో, ఏ జానర్‌లో తెరకెక్కుతుందో అన్న వివరాలు అప్పుడే ప్రకటించనున్నారని సమాచారం. అక్షయ్ కెరీర్‌లో ఇది ఒక మైలురాయి కాబట్టి అభిమానులు, ఇండస్ట్రీ అంతా ఈ అనౌన్స్‌మెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇకపోతే, అక్షయ్ కుమార్ నటించిన మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘జాలీ ఎల్‌ఎల్‌బీ 3’ సెప్టెంబర్ 19న విడుదల కానుంది. ఈ సిరీస్‌కి ఉన్న పాపులారిటీ కారణంగా ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొత్తానికి, అక్షయ్ కుమార్ పుట్టినరోజు అభిమానులకు నిజంగానే పండుగలా మారనుంది. 200వ సినిమా అనౌన్స్‌మెంట్‌తో పాటు, ఇప్పటికే రాబోయే జాలీ ఎల్‌ఎల్‌బీ 3తో ఆయన తన జోష్‌ను మరింత రెట్టింపు చేయబోతున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!