స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఓ స్టార్ హీరో కోవిసెల్ఫ్ కిట్ పంపాడు. ఈ విషయాన్ని రకుల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది. ఆ స్టార్ ఎవరో కాదు బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్. అక్షయ్ కోవిసెల్ఫ్ బ్రాండ్ అంబాసిడర్. అక్షయ్ కోవిసెల్ఫ్ బ్రాండ్ అంబాసిడర్. కోవిసెల్ఫ్ మొట్టమొదటి ఇండియా రాపిడ్ యాంటిజెన్ సెల్ఫ్ టెస్ట్ కిట్. దీంతో ప్రజలు ఇంట్లోనే కోవిడ్ పరీక్ష చేసుకోవచ్చు.
Read Also : “అల అమెరికాపురంలో” ప్రోమో లాంచ్ చేయనున్న బన్నీ
ఈ హీరో ఈ సెల్ఫ్ టెస్ట్ కిట్లను బాలీవుడ్ తారలు కరణ్ జోహార్, కత్రినా కైఫ్, కియారా అద్వానీ, వాణి కపూర్, భూమి పెడ్నేకర్, లారా దత్, మౌని రాయ్, సిద్ధార్థ్ మల్హోత్రా, యామి గౌతమ్ లతో పాటు పలువురు ప్రముఖులకు పంపారు. తాజాగా రకుల్, ఆమె కుటుంబ సభ్యుల కోసం కూడా కోవిసెల్ఫ్ కిట్ ను పంపారు అక్షయ్. కాగా “రాట్చసన్” హిందీ లో అక్షయ్ కుమార్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించనున్నారు. ఈ రీమేక్ కు “మిషన్ సిండ్రెల్లా” టైటిల్ ను ఖరారు చేశారు. మరి తమిళంలో, తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులను కూడా థ్రిల్ చేయనున్నారేమో చూడాలి.