దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఆందోళనకరంగా ఉంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా కరోనా సంక్షోభంపై పోరాటానికి తమవంతు కృషి చేస్తున్నారు. తాజాగా ఈ దంపతులు 100 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ను డొనేట్ చేశారు. కరోనాపై పోరాటానికి ఎవరేం చేయగలిగితే అది చేయాలని కోరారు ట్వింకిల్ ఖన్నా. అయితే తమ కుటుంబం ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న కారణంగా కొన్ని రోజుల నుంచి సైలెంట్ గా ఉన్నాను అని ఆమె తెలిపారు. ఇటీవల కరోనా బారిన పడిన అక్షయ్ కుమార్ ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందిన తరువాత కోవిడ్ -19 నుండి కోలుకున్నాడు.