Site icon NTV Telugu

Akhil: స్ట్రైక్ ఎఫెక్ట్.. లెనిన్ మరింత ఆలస్యం

Lenin, Akhil

Lenin, Akhil

అఖిల్ హీరోగా చేసిన ఏజెంట్ సినిమా ఎంత దారుణమైన డిజాస్టర్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా రిజల్ట్ దెబ్బకి అఖిల్ మరో సినిమా సైన్ చేయకుండా చాలాకాలం బ్రేక్ తీసుకున్నాడు. చాలా బ్రేక్ తీసుకున్న అనంతరం ఆయన లెనిన్ అనే సినిమా సైన్ చేశాడు. గతంలో కిరణ్‌తో ఒక సినిమా చేసిన మురళీకృష్ణ అబ్బూరు అనే దర్శకుడు దర్శకత్వంలో, రాయలసీమ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతోంది. అయితే, ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది. వాస్తవానికి సినిమాని డిసెంబర్‌లో రిలీజ్ చేయాలనుకున్నారు.

Also Read : 8200mAh భారీ బ్యాటరీ, IP69+ సర్టిఫికేషన్ తో విడుదలకు సిద్దమైన Vivo Y500

కానీ ఇప్పుడు మరింత ఆలస్యంగా సినిమా రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే, ఈ సినిమా షూటింగ్ భాగ్యశ్రీ బోర్సే ఎంట్రీ తర్వాత మళ్లీ రీషూట్ చేయాల్సి వచ్చింది. ముందుగా శ్రీ లీలను హీరోయిన్‌గా అనుకున్నారు, కానీ ఆమె తప్పుకోవడంతో ఆమె స్థానంలో భాగ్యశ్రీని రంగంలోకి దించారు. ఆమెతో చేసిన సినిమాలోని అన్ని సీన్‌లనూ మళ్లీ రీషూట్ చేయాల్సి వచ్చింది. మరోపక్క ఇండస్ట్రీ స్ట్రైక్ కూడా సినిమా అవుట్‌పుట్ మీద ఎఫెక్ట్ పడింది. కాబట్టి, డిసెంబర్‌లో రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్‌లో మరిన్ని సినిమాల రిలీజ్‌లు కూడా ఉన్నాయంటూ, ఇప్పుడు హడావిడిగా షూటింగ్ జరిపి ఆ సినిమాని రిలీజ్ చేయడం కాస్త ఇబ్బందిగా ఉంటుందని, నింపాదిగా షూట్ చేసి వేసవిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version