Site icon NTV Telugu

Agent OTT: ఎట్టకేలకు ఓటీటీ లోకి వస్తున్న అయ్యగారు

Maxresdefault

Maxresdefault

Agent OTT: టాలీవుడ్ ​యంగ్ హీరో అక్కినేని అఖిల్, స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబోలో వచ్చిన సినిమా “ఏజెంట్‌”. ఈ సినిమాలో అఖిల్‌ సరసన హీరోయిన్ గ సాక్షి వైద్య నటించగా.. మ‌ల‌యాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. స్పై యాక్ష‌న్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ గతేడాది ఏప్రిల్‌ నెలలో రిలీజ్ అయ్యింది. అయితే అందరూ ఏజెంట్‌ బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకున్నా ఊహించని విధంగా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గ నిలిచింది. దాదాపు రూ 85 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ.. థియేట‌ర్ల‌లో కేవ‌లం 8 కోట్ల క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే రాబ‌ట్టి నిర్మాత‌ల‌కు భారీగా న‌ష్టాల‌ను మిగిల్చింది. ఇక ఆ తరువాత ఓటీటీ లోకి వస్తుంది అనుకున్న ఏవో అడ్డంకుల వల్ల స్ట్రీమింగ్ కాలేదు.

Also Read: Rakul Preet Brother: షాకింగ్: డ్రగ్స్ కేసులో రకుల్ తమ్ముడు అరెస్ట్

ఈ మూవీ డిజిటల్ హక్కులను సోనీ లివ్ దక్కించుకున్నా.. ఇప్పటికీ ఓటీటీలోకి రాలేదు. ఇక తాజాగా వస్తున్న వార్తల ప్రకారం.. ఈ మూవీ నేరుగా టీవీలోనే టెలికాస్ట్ కానుంది. అది కూడా కేవలం హిందీ వెర్షన్ మాత్రమే. జులై 28న గోల్డ్‌మైన్స్ టీవీ ఛానల్ లో హిందీ లాంగ్వేజ్ లో టెలికాస్ట్ కానుంది. తెలుగు లో ఇంకా స్ట్రీమింగ్ డేట్ రిలీజ్ చేయకపోవడంతో అఖిల్ ఫాన్స్ కాస్త డిస్పాయింట్ అవుతున్నారు. తెలుగులో కూడా వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని ఫాన్స్ ఆందోళన చేస్తున్నారు. ఇక వక్కంత వంశీ కథ అందించిన ఈ మూవీ ఓటీటీ లో ఎంత మేరకు రాణిస్తుందో చూడాలి.

https://www.youtube.com/watch?v=fv3C4amnI1o

Exit mobile version