NTV Telugu Site icon

Akhil : రాయలసీమ నేపథ్యంలో అక్కినేని అఖిల్‌..

Akhil

Akhil

ఎంత సిని బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికి మంచి ఫేమ్ సంపాదించుకోవాలి అంటే లక్ ఉండాలి. అలా వచ్చిన హీరోలు చాలా మంది నానారకాలుగా ట్రై చేస్తున్నప్పటికీ సరైన హిట్ మాత్రం అందుకోలేక పోతున్నారు. ఇందులో అక్కినేని అఖిల్ ఒకరు. కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కోసం ఎదురుచూస్తున్నా అఖిల్‌, గత చిత్రం ‘ఏజెంట్‌’ ఆశించిన స్థాయిలో సక్సెస్‌కాకపొయింది. దీంతో తదుపరి సినిమాల విషయంలో ప్రత్యేక శ్రద్ధతీసుకుంటున్న అఖిల్, ప్రస్తుతం స్వీయ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఓ చిత్రాన్ని చేస్తున్నారు.

Also Read: Retro : ‘రెట్రో’ మూవీ నుంచి పూజా హెగ్డే అప్ డేట్..

‘వినరో భాగ్యము విష్ణు కథ’ మూవీ ఫేమ్ మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో రూపొందే ఈ ప్యాన్ ఇండియా మూవీకి ‘లెనిన్’ పేరును ఖరారు చేసినట్లు టాక్. అయితే ఈ మూవీ కోసం వచ్చే సంవత్సరం దాకా ఎదురు చూసే అవసరం లేదట. ఎందుకంటే ఈ వారం నుంచి మొదలుపెట్టబోయే షెడ్యూల్‌ని, ఏకధాటిగా 20 రోజుల పాటు కొనసాగించి 50 శాతం షూటింగ్ పూర్తి చేస్తారట. అంతేకాదు విదేశాలకు వెళ్లే అవసరం లేకుండా వీలైనంత అధిక శాతం తెలుగు రాష్ట్రాల్లోనే చిత్రీకరణ జరపనున్నారట. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని రాయలసీమ నేపథ్యంలో, పవర్‌ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించబోతున్నారు. ఎక్కువ భాగం షూటింగ్ చిత్తూరు జిల్లాలో జరుగనుందట. ఇక హీరోయిన్ గా శ్రీలీలను తీసుకునే అవకాశముందని దసరా బరిలో రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం..