“బాహుబలి-2” రికార్డును బ్రేక్ చేసిన అజిత్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో తల అజిత్ “బాహుబలి-2” రికార్డును బ్రేక్ చేయడం ఇప్పుడు విశేషంగా మారింది. గత కొన్నాళ్లుగా అజిత అభిమానులు సోషల్ మీడియా వేదికగా అజిత్ తాజాగా నటిస్తున్న “వాలిమై” ఫస్ట్ లుక్ కావాలంటూ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఫేమస్ టికెట్ బుకింగ్ యాప్ సినిమాపై ఎంతమందికి ఇంటరెస్ట్ ఉందో తెలపాలంటూ సర్వే నిర్వహించింది. అందులో అజిత్ ‘వాలిమై’… బాహుబలి 2, ఎవెంజర్స్: ఎండ్ గేమ్ రికార్డులను అధిగమించి సరికొత్త రికార్డును సృష్టించింది.
Read Also : శింబు, గౌతమ్ మెనన్, ఏఆర్ రెహ్మాన్ కాంబినేషన్ లో క్రేజీ మూవీ!
Also Read
‘వాలిమై’ బుక్‌మైషోలో 1.73 మిలియన్లకు పైగా ఇంటరెస్ట్ లను సంపాదించింది. ఈ సంఖ్య ఎవెంజర్స్: ఎండ్ గేమ్, బాహుబలి 2 సంపాదించిన ఇంటరెస్ట్ ల కన్నా ఎక్కువ కావడం విశేషం. ఎవెంజర్స్: ఎండ్ గేమ్ విడుదలకు ముందు 1.70 మిలియన్ ఇంటరెస్ట్ లను, బాహుబలి-2 1 మిలియన్ ఇంటరెస్ట్ లను కలిగి ఉంది. ఇక “వాలిమై” చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలకు ముందే అజిత్ అభిమానుల ద్వారా ఈ ఘనతను సాధించగలిగాడు. ఇప్పుడే ట్రెండ్ సెట్ చేస్తున్న అజిత్ అభిమానులు ఇక ‘వాలిమై’ ఫస్ట్ లుక్ వచ్చిందంటే ఏ రేంజ్ లో రచ్చ చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాగా ఈ ఏడాది ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో “వాలిమై” ఒకటి. ఈ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. ఆయన గతంలో ‘నెర్కొండ పార్వై’తో అజిత్‌కు బ్లాక్ బస్టర్ అందించారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!