తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ సినిమా ‘విదాముయార్చి’. నేడు వరల్డ్ వైడ్ గా ‘విదాముయార్చి’ థియేటర్లలో విడుదలైంది. నిన్నటి నుండే థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హంగామా మాములుగా లేదనే చెప్పాలి. మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా అర్జున్, రెజీనా తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది.
Also Read : Siddharth : మిడిల్ క్లాస్ కథా నేపథ్యంతో వస్తున్న సిద్దార్ధ్ ‘3BHK’
కాగా ఓవర్సీస్ లో ఈ ప్రీమియర్స్ తో విడుదల అయిన ఈ సినిమా ప్రీమియర్ టాక్ ఎలా ఉందంటే. అనుకున్నట్టు గానే ఈ సినిమా హాలీవుడ్ సినిమా బ్రేక్ డౌన్ రీమేక్ అని కథ నేపథ్యం ఆ హాలీవుడ్ సినిమా నుండి తీసుకున్నారు. ఇక సినిమా స్టార్ట్ అయిన మొదటి 20 నిముషాలు స్లో పేజ్ స్టార్ట్ అయి అనంతరం కథలోకి వెళ్లిన దర్శకు ఎంగేజ్ చేయగలిగాడు. ముఖ్యంగా యాక్షన్ పార్ట్ స్టైలిష్ గా ఆకట్టుకుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ తో ఫస్ట్ ముగించాడు. ఇక సెకండ్ ఆఫ్ అక్కడక్కడ కాస్త మెప్పించింది తప్ప ఆకట్టుకోలేదు. ఓవరాల్ గా విదాముయార్చి ఓ సారి అజిత్ కోసం చూడగలిగే యాక్షన్ చిత్రం అని ఎక్స్ లో కామెంట్స్ చేస్తున్నారు. అనిరుద్ మ్యూజిక్ ఏ మాత్రం బాలేదు అనే ఓ నెటిజన్ కామెంట్ చేసాడు. ఈ సినిమా తెలుగులో పట్టుదల పేరుతో ప్రముఖ పంపిణి దారులు ఏషియన్ సురేష్ విడుదల చేస్తున్నారు.