తమిళ స్టార్ హీరో అజిత్ కు రైడింగ్ అంటే ఎంతో పేషన్! సూపర్ బైక్స్ అండ్ సూపర్ కార్స్ ను డ్రైవ్ చేయడానికి అజిత్ ఇష్టపడుతుంటాడు. ఈ విషయంలో అతను ఎంత స్పెషలిస్టో అందరికీ తెలిసిందే. అయితే… తన రాబోయే సినిమాలో అజిత్ కార్లు లేదా బైక్స్ నడపబోవడం లేదట! ఈసారి ఈ మాస్ హీరో తన చేతిల్లోకి బస్ స్టీరింగ్ ను తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ‘నేర్కొండ పార్వై’ (హిందీ ‘పింక్’ రీమేక్) తర్వాత అజిత్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వంలో బోనీ కపూర్ ఇప్పుడు ‘వాలిమై’ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇందులోని ఓ భారీ యాక్షన్ సీన్ చిత్రీకరణ కోసం అజిత్ బస్ ను డ్రైవ్ చేస్తున్నాడట. విశేషం ఏమంటే… ఇందులో యాక్షన్స్ సీన్స్ గురించి ఇటీవల బోనీ కపూర్ చెబుతూ, ‘డూప్ ను కూడా ఉపయోగించకుండా రిస్కీ యాక్షన్ సీన్స్ లో అజిత్ స్వయంగా నటించా’డని కితాబిచ్చాడు. ఆగస్ట్ లో జనం ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఒకే ఒక్క యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ బాలెన్స్ ఉందని తెలుస్తోంది. అతి త్వరలోనే దీనిని స్పెయిన్ లో చిత్రీకరిస్తారట. ఈ యాక్షన్ ఫ్యామిలీ డ్రామాలో అజిత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ‘వాలిమై’తోనే తెలుగు నటుడు కార్తికేయ విలన్ గా కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.