Kayadu Lohar: ఆషికా, ఆండ్రియా కాదు.. ‘తలా’ సరసన కయాదు లోహర్‌!

Kayadu Lohar Ajith Movie

Kayadu Lohar Ajith Movie

Kayadu Lohar Likely to Join Ajith Dare Devilతమిళ స్టార్ హీరో, తలా అజిత్‌ అభిమానులకు ఎట్టకేలకు ఓ గుడ్ న్యూస్ వచ్చేసింది. అజిత్‌ నటించబోయే 64వ సినిమాకు ‘డేర్ డెవిల్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ నవంబర్ 2 నుంచి ప్రారంభం కానున్నట్లు మేకర్స్ తాజాగా అప్డేట్ ఇచ్చారు. దీంతో చాలా కాలంగా ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్న తలా అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

అజిత్ చివరిగా నటించిన సినిమా విడుదలై ఏడాదిన్నర దాటిపోయింది. ప్రస్తుతం ఆయన చేతిలో సినిమా లేదంటే మాత్రం కాదు. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తర్వాత మరోసారి దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌కే అవకాశం ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాను అజిత్ 64గా ప్రకటించారు. అయితే నిర్మాతల విషయంలో సరైన క్లారిటీ లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ చాలాకాలంగా ఆలస్యమవుతూ వచ్చింది. మరోవైపు అజిత్ కార్ రేసింగ్‌తో బిజీగా ఉండటంతో సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వస్తుందనే విషయంలో అభిమానుల్లో సందిగ్ధత నెలకొంది.

ఈ సినిమాకు అజిత్ అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు ముందుకు రాకపోవడంతో ఆయనే నిర్మాతగా మారారు. అయినప్పటికీ ప్రాజెక్ట్ ఆలస్యమవుతూ ఉండటంతో హీరోయిన్ శ్రీలీల నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో దర్శకుడు అధిక్ రవిచంద్రన్ కొత్త హీరోయిన్ కోసం అన్వేషణ మొదలుపెట్టారు. మొదట ఆషికా రంగనాథ్, ఆండ్రియా పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ఈ ఇద్దరిలో ఎవరినీ అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా కయాదు లోహర్‌ పేరు వినిపిస్తోంది. శ్రీలీల స్థానంలో ఆమె దాదాపు ఖరారైనట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌కు సినిమాల్లో హీరోయిన్ పేరు విషయంలో ఓ ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. తన చిత్రాల్లో హీరోయిన్ పాత్రకు ‘రమ్య’ అనే పేరు పెట్టడం ఆయనకు అలవాటు. మొదటి సినిమా ‘త్రిష ఇల్లానా నయనతార’ నుంచి ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వరకు ఈ సెంటిమెంట్ కొనసాగింది. ఇప్పుడు అజిత్ 64గా తెరకెక్కనున్న ‘డేర్ డెవిల్’లో కూడా హీరోయిన్ పాత్ర పేరు రమ్యగానే ఉంటుందా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. మరి ఈ సినిమాలో రమ్య పాత్రను ఏ హీరోయిన్ పోషించనుంది?, కయాదు లోహర్‌ పేరు నిజంగానే ఖరారైందా? అనే విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నవంబర్ 2 నుంచి షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.