కూతురు ఆరాధ్య బర్త్ డే సందర్భంగా మాజీ విశ్వ సుందరి, నటి ఐశ్వర్య రాయ్ ఎమోషనల్ అయ్యింది. గురువారం (నవంబర్ 16) ఆరాధ్య తన 12వ ఏట అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమెకు బచ్చన్ ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్, సినీ ప్రముఖుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లుత్తాయి. ఇక కూతురు 12వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా ఐశ్వర్యరాయ్ భావోద్వేగానికి లోనయ్యింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. ‘హ్యాపీ హ్యాపీ హ్యాపీ బర్త్ డే మై డార్లింగ్ ఎంజెల్ ఆరాధ్య.. నిన్ను నేను అనంతంకు మించి ప్రేమిస్తున్నాను. నా జీవితంలో సంపూర్ణ ప్రేమ నువ్వు. నీ కోసమే నేను ఊపిరి పీల్చుకుంటున్నా. ఎల్లప్పుడు నీకు ఆ దేవుడి ఆశీర్వాదాలు ఉంటాయి. నువ్వు నా జీవితంలోకి వచ్చినందుకు ధన్యవాదాలు. నా అంత్యంత విలువైన ప్రేమవి నువ్వు.. ఐ లవ్ యూ ద మోస్ట్’ అంటూ కూతురిపై ప్రేమ కురిపించింది.
Also Read: KA Paul: అప్పుడు చిరంజీవి, ఇప్పుడు పవన్ కల్యాణ్..! చంద్రబాబుతో రూ.1,500 కోట్ల డీల్..!
ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అలాగే అభిషేక్ బచ్చన్ కూడా కూతురికి బెస్ట్ విషెస్ తెలిపాడు. ఆరాధ్య చిన్ననాటి ఫొటో షేర్ చేశాడు. ‘హ్యీపీ బర్త్ డే మై టిటిల్ ప్రిన్సెస్ ఐ లవ్ యూ మోస్ట్‘ అంటూ కూతురికి విషెస్ తెలిపాడు. కాగా ఆరాధ్య, ఐశ్వర్య రాయ్ బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పుడూ కూతురిని అట్టిపెట్టుకునే ఉంటుంది ఐశ్వర్య. అలాగే సోషల్ మీడియాలో చాలా అరుదుగే కనిపించే అభిషేక్ బచ్చన్ కూడా తరచూ ఆరాధ్యకు సంబంధించిన పోస్ట్స్ షేర్ చేస్తూ తండ్రిగా మురిసిపోతుంటాడు. కాగా 2007 నవంబర్ 20 ఐశ్వర్య-అభిషేక్ బచ్చన్‌ల వివాహం జరగగా.. వీరికి నవంబర్ 16, 2011లో ఆరాధ్య జన్మించింది.
Also Read: Anasuya : డీప్ బ్లౌజ్ లో ఇబ్బంది పడిన అనసూయ..
