Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..

Aishwarya Lekshmi

Aishwarya Lekshmi

Aishwarya Lekshmi: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం ‘రాకా’ (Raaka). ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో నటీనటుల ఎంపికపై రోజుకో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే మలయాళ ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మి ఇందులో పవర్‌ఫుల్ నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తోందంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. తాజాగా ఈ రూమర్లపై స్వయంగా ఐశ్వర్య లక్ష్మి స్పందించి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ‘రాకా’లో నెగిటీవ్ షేడ్స్ ఉన్న రూల్‌లో కనిపించబోతున్నానన్న వార్తలపై ఐశ్వర్య లక్ష్మి బాహాటంగానే రియాక్ట్ అయ్యారు. ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని కొట్టిపారేశారు. సోషల్ మీడియాలో ఈ పుకార్లు చూసి ఫస్ట్ ఆశ్చర్యపోయి నవ్వుకున్నానని చెబుతూ.. “అసలు ఆ సినిమాలో నేనే లేను, ఎవరైనా నాకు ఈ ప్రాజెక్టులో ఛాన్స్ ఇప్పిస్తే బాగుంటుంది” అంటూ సరదాగా కామెంట్ చేశారు. దీంతో గత కొన్ని రోజులుగా నడుస్తున్న విలన్ రోల్ ప్రచారానికి ఈ ఒక్క ప్రకటనతో తెరపడినట్లయింది.

దర్శకుడు అట్లీ ఈ సినిమాను భారీ కాన్వాస్‌పై ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. కథానుగుణంగా ‘రాకా’లో మొత్తం నలుగురు హీరోయిన్స్‌కి స్థానముందని ఇండస్ట్రీ వర్గాల్లో ఎప్పటినుంచో బలమైన టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు తెలుస్తున్న వివరాల ప్రకారం.. బన్నీ సరసన మెయిన్ ఫీమేల్ లీడ్‌గా బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణె నటించనున్నారని సమాచారం. అలాగే మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఫెమినా జార్జ్ కూడా మరో కీలక పాత్ర కోసం ఇప్పటికే ఫైనల్ అయ్యారని టాక్ వినిపిస్తుంది. మిగిలిన రెండు పాత్రల కోసం బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేర్లు జోరుగా చక్కర్లు కొడుతున్నప్పటికీ, మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అఫీషియల్ గ్రీన్ సిగ్నల్ రాలేదు. ‘పుష్ప’ ఫ్రాంచైజీతో గ్లోబల్ స్థాయిలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్.. ‘జవాన్’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అట్లీతో చేతులు కలపడంతో ‘రాకా’పై హైప్ ఆకాశాన్ని తాకుతోంది. స్టార్ క్యాస్టింగ్‌లో జరుగుతున్న మార్పులు, చేర్పులు ఈ సినిమాపై ఉన్న ఆసక్తిని రోజురోజుకూ రెట్టింపు చేస్తున్నాయి. అసలు ఇందులో ఎంత మంది హీరోయిన్లు ఉన్నారన్నది చిత్ర యూనిట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.