AHA : ‘రైటర్స్ టాలెంట్ హంట్’ అనౌన్స్ చేసిన ‘ఆహా’
- కొత్త టాలెంట్ కోసం ఆహా హంటింగ్
- రైటర్స్ టాలెంట్ హంట్ నిర్వహిస్తున్న ఆహా
- ప్రతిభను వెలికి తీయడమే ఆహా ఆశయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతిభావంతులైన రచయితలను ప్రోత్సహించేందుకు టాలెంట్ హంట్ ను సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ కంపెనీస్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాస్ మూవీ మేకర్స్, డైరెక్టర్ సాయి రాజేశ్ అమృత ప్రొడక్షన్స్ సహకారంతో ప్రకటించింది ఆహా ఓటీటీ. ఈ టాలెంట్ హంట్ ద్వారా ప్రతిభ గల రచయితలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ టాలెంట్ హంట్ వివరాలను తెలిపే కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆహా ఓటీటీ కంటెంట్ హెడ్ వాసుదేవ్ కొప్పినేని మాట్లాడుతూ – అల్లు అరవింద్ గారు ఎప్పుడూ న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తుంటారు. ఇప్పటికే పలువురు ఆయన ప్రోత్సాహంతో ఇండస్ట్రీకి పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అరవింద్ గారి బాటలోనే ఆహా పయణిస్తోంది. ఆహా ద్వారా యంగ్ టాలెంట్ ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఇది మరింతగా కొనసాగించేందుకే మాస్ మూవీ మేకర్స్ ఎస్ కేఎన్, అమృత ప్రొడక్షన్స్ సాయి రాజేశ్ గారితో మేము రైటర్ టాలెంట్ హంట్ నిర్వహిస్తున్నా. వారి స్క్రిప్ట్ ను బట్టి సినిమా, వెబ్ సిరీస్ అవకాశాలు అందించే ప్రయత్నం చేస్తాం. అన్నారు.
నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ – మిగతా భాషల్లో వచ్చిన వైవిధ్యమైన కథలు మన తెలుగులో ఎందుకు రావడం లేదనేది మాకు తరుచూ ఎదురయ్యే ప్రశ్న. తమకు తగినంత గుర్తింపు, కష్టానికి తగిన ఫలితం దక్కడం లేదని చెప్పే రచయితలు కొందరితో నేను మాట్లాడాను. అందుకే ఎగ్జైట్ చేసే స్క్రిప్టులతో వచ్చే టాలెంటెడ్ రైటర్స్ కోసం ఒక వేదికగా ఈ టాలెంట్ హంట్ ను ఏర్పాటు చేస్తున్నాం. ఆహా, అమృత ప్రొడక్షన్స్ సహకారంతో టాలెంటెడ్ రైటర్స్ కు మంచి అవకాశాలు కల్పించాలని ప్రయత్నం చేస్తున్నాం. ప్రతిభావంతులైన రచయితలను ఈ టాలెంట్ హంట్ కు ఆహ్వానిస్తున్నాం. అన్నారు. రైటర్స్ టాలెంట్ హంట్ లో పాల్గొనాలనుకునేవారు కామెడీ, థ్రిల్లర్, డ్రామా, హర్రర్, రొమాన్స్ మరియు యాక్షన్ వంటి వివిధ జానర్స్ లో తమ రచనలను పంపించవచ్చు. మరిన్ని వివరాలు ఆహా ఓటీటీ, ఆహా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో చూడవచ్చు.
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!