NTV Telugu Site icon

Aditya 369 : రీ-రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘ఆదిత్య 369’

Adhithya369

Adhithya369

ఫస్ట్ ఇండియన్ టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ఆదిత్య 369’. నందమూరి బాలకృష్ణ హీరోగా, లెజండరీ  డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1991లో వచ్చి ఘన విజయం సాధించింది. ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఈ చిత్రం తెలుగు క్లాసిక్ మూవీస్ లో ఒకటిగా నిలిచిపోయింది. దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ సంస్థ నిర్మించి ఈ చిత్రాన్ని ఇప్పుడు మూడు దశాబ్దాల తర్వాత మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. కాగా తాజాగా రీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మూవీ టీమ్.

కాగా ఇటీవల మహా శివరాత్రి పండుగ సందర్భంగా ‘ఆదిత్య 369’ సినిమాని రీ రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు అనౌన్స్ చేశారు. సమ్మర్ లో రిలీజ్ చేస్తామని చెప్పారు కానీ, డేట్ ఏంటి అనేది మాత్రం చెప్పలేదు. అయితే తాజాగా ఈ చిత్రాన్ని ఇప్పుడు 4K వెర్షన్‌లో ఏప్రిల్ 11న గ్రాండ్ రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. సౌండ్ కూడా 5.1 క్వాలిటీ లోకి కన్వర్ట్ చేశామని.. ప్రసాద్స్ డిజిటల్ టీం 6 నెలల పాటు శ్రమించి చక్కటి అవుట్ పుట్ ఇచ్చారని, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ తెలిపారు. అలాగే వింటేజ్ బాలయ్యను మరోసారి థియేటర్ లో చూసి అభిమానులు ఎంజాయ్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.