తన అభిమానులకు, అలాగే తనతో పని చేసే ఫోటోగ్రాఫర్లకు అదితీ రావు హైదరి ఒక హెచ్చరిక జారీ చేసింది. తన పేరుతో, తన ఫోటోలతో ఎవరో వ్యక్తి వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసి, అది తానే అని భ్రమింపజేసేలా చాట్ చేస్తున్నారని ఆమె తెలిపింది. ఎవరో తన ఫోటోలు ఉపయోగించి అకౌంట్ సృష్టించి, ఫోటో షూట్ గురించి మెసేజ్‌లు పంపుతున్నారని ఆమె పేర్కొంది. తాను ఎప్పుడూ తన వ్యక్తిగత వాట్సాప్ ద్వారా ఫోటోషూట్స్ లేదా వర్క్ గురించి మాట్లాడనని, ఎల్లప్పుడూ తన టీమ్‌ద్వారానే కమ్యూనికేషన్ జరుగుతుందని తెలిపారు.
Also Read :Allu Arjun: షాకింగ్.. రీ రిలీజ్ వద్దన్న బన్నీ?
“నా ఫోటో పెట్టి నేనే అని చూపిస్తూ ఎవరో వాట్సాప్‌లో ఫోటోగ్రాఫర్లకు మెసేజ్ చేస్తున్నారు. అది నేను కాదు. నేను అలా ఎప్పుడూ సంప్రదించను. నా పని విషయంలో వ్యక్తిగత నంబర్ ఉపయోగించను, ఎప్పుడూ నా టీమ్ మాత్రమే సంప్రదిస్తుంది. ఆ నంబర్ విషయంలో జాగ్రత్త. ఆ నంబర్ నుంచి ఏమైనా మెసేజ్ వస్తే నా టీమ్ దృష్టికి తీసుకురండి. నన్ను ఎల్లప్పుడూ కాపాడుతూ నా వెంట నిలబడే అందరికీ ధన్యవాదాలు” అని అదితీ రావు పేర్కొంది. ఈ మధ్యకాలంలో అదితీ రావు వరుస సినిమాలు సైన్ చేయకపోయినా, ఎక్కువగా మ్యాగజైన్ ఫోటోషూట్స్‌లో బిజీగా ఉంటూ, ఆసక్తికరమైన బ్రాండ్లను సంపాదిస్తోంది. సెప్టెంబర్ 2024లో ఆమె సిద్ధార్థ్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
