టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన శ్రీలీల, ఇప్పుడు బాలీవుడ్‌పైనా కన్నేసింది. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ యంగ్ బ్యూటీ, తాజాగా తన కెరీర్ ప్రారంభంలో చేసిన తప్పుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒక దశలో తను ఎంచుకున్న సినిమాల విషయంలో తనకే ఎన్నో సందేహాలు కలిగాయని ఆమె సంచలన విషయాలను బయటపెట్టింది. ముంబైలో మెడిసిన్ చదువుతున్న రోజుల్లోనే తనకు ఎన్నో సినిమా ఆఫర్లు వచ్చాయని శ్రీలీల గుర్తుచేసుకుంది. అయితే అప్పుడు చదువుపైనే పూర్తి ధ్యాస ఉండటంతో చాలా సినిమాలను వదులుకోవాల్సి వచ్చిందని తెలిపింది. చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం వల్ల, ఎలాంటి కథలను ఎంచుకోవాలో, ఏ సినిమా చేయాలో అర్థమయ్యేంత పరిపక్వత అప్పట్లో తనకు లేదని పేర్కొంది.
కెరీర్ తొలినాళ్లలో వచ్చిన ప్రతి అవకాశాన్ని అంగీకరించడమే పనిగా పెట్టుకున్నానని, ఆ విషయంలో ఎంతో తడబాటు ఉండేదని శ్రీలీల ఓపెన్‌గా చెప్పింది. అయితే ఒకానొక సమయంలో తాను నటించిన సినిమాల ఎంపికపై తనకే అనుమానాలు మొదలయ్యాయని ఆమె వెల్లడించింది. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా గతాన్ని తలుచుకుంటూ, తను ఎక్కడ పొరపాటు చేశానో విశ్లేషించుకునేదానినని తెలిపింది. మన జీవితం మారాలంటే మన నిర్ణయాలు మనమే తీసుకోవడం మొదలుపెట్టాలని శ్రీలీల స్పష్టం చేసింది. గతంలో లాగా వచ్చిన ప్రతి సినిమాకు ఓకే చెప్పకుండా, ఇప్పుడు ఏ సినిమా చేయాలి, దేనిని పక్కన పెట్టాలి అనే విషయంలో పూర్తి స్పష్టతతో సొంత నిర్ణయాలు తీసుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చింది. తన కెరీర్‌ను తానే సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతున్నట్లు శ్రీలీల తెలిపిన ఈ విషయాలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

