ఓ వైపు కరోనా మహమ్మారి, మరోవైపు లాక్ డౌన్… సామాన్యుడి నుంచీ సెలబ్రిటీల దాకా అందరూ ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. పూటగడవని వారికి లాక్ డౌన్ పెద్ద శాపమే. కానీ, ఎప్పుడూ బిజిగా ఉండే సినిమా సెలబ్రిటీలకు ఇష్టం, ఉన్నా లేకున్నా ప్రస్తుతం రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దాంతో చాలా మంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారుతున్నారు. అభిమానులతో టచ్ లోకి వచ్చి పాత, కొత్త ఫోటోలు షేర్ చేస్తూ విజువల్ ట్రీట్స్ ఇస్తున్నారు.
90స్ లోని కుర్రాళ్లకు కళ్లు మూస్తే కనిపించిన అద్భుత వెండితెర సౌందర్యం సిమ్రాన్. అయితే, పెళ్లి చేసుకుని చాలా రోజులు గ్లామర్ ప్రపంచానికి దూరమైంది. ఈ మధ్య మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుంటోంది. అయితే, అందరిపైన పడ్డట్టే సిమ్రాన్ పైన లాక్ డౌన్ ఎఫెక్ట్ పడింది. చేస్తోన్న సినిమాలు, చేయాల్సి ఉన్న చిత్రాలు అన్నీ ఆగిపోయాయి. అందుకే, ఇంట్లో ఫ్రీ టైంని ఎంజాయ్ చేస్తోన్న సీనియర్ సుందరి ఓ ఫ్యామిలీ ఫోటో ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
‘’అదుగో ఆ నీడ దీపక్. కెమెరా ముందు నేను, అధీప్, ఆదిత్’’ అంటూ సిమ్రాన్ తన తాజా ఫోటోకి క్యాప్షన్ ఇచ్చింది. దీపక్ ఆమె భర్త కాగా, అధీప్, ఆదిత్ కొడుకులు. ఫోటో లొకేషన్ ని బట్టి చూస్తే ఏదో వెకేషన్ టైంలో గతంలో తీసింది అని చెప్పవచ్చు. ఈ బ్యూటిఫుల్ బగ్గా ఫ్యామిలీ పిక్ చూసి మిసెస్ సిమ్రాన్ బగ్గా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. పాజిటివ్ కామెంట్స్ తో సిమ్రాన్ బెస్ట్ విషెస్ చెబుతున్నారు!