Tollywood : ‘రెగ్యులర్’ ముద్ర కేవలం మహిళలకేనా? .. రజిత ఆవేదన కరెక్టేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల ‘దొంగ నా కొడుకు’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రజిత చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో ఒక లోతైన చర్చకు దారి తీశాయి. డైరెక్టర్లు కొత్తదనం పేరుతో తెలుగు నటీమణులను పక్కన పెడుతున్నారని, మగ ఆర్టిస్టులకు లేని ‘రెగ్యులర్’ (బోర్ కొట్టడం) అనే ముద్ర కేవలం ఫీమేల్ ఆర్టిస్టులకే ఎందుకు వేస్తున్నారని ఆమె సూటిగా ప్రశ్నించారు. 90వ దశకంలో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన రజిత లాంటి నటి, ఒక చిన్న పాత్ర కోసం ఇతర రాష్ట్రాల నుంచి ఆర్టిస్టులను తీసుకురావడంపై తన ఆవేదన వ్యక్తం చేయడం తెలుగు పరిశ్రమలో ఉన్న డబుల్ స్టాండర్డ్స్‌ను కళ్లకు కట్టింది. దర్శకులు పైకి చెబుతున్నట్లుగా సీనియర్ నటీమణులను చూసి ప్రేక్షకులు బోర్ ఫీల్ అవ్వడం అనేది కేవలం ఒక సాకు మాత్రమే. దీని వెనుక అసలు మ్యాటర్ వేరే ఉంది. ప్రస్తుతం టాలీవుడ్లో ప్రతి సినిమా వ్యాపార దృక్పథంతోనే ముడిపడి ఉంది. ఒకప్పటిలాగా కేవలం తెలుగు రాష్ట్రాలకే మార్కెట్ పరిమితం కాలేదు. డబ్బింగ్, శాటిలైట్, ఓటీటీ, పాన్ ఇండియా.. ఇలా రకరకాల ప్లాట్‌ఫామ్స్ వచ్చాయి. దీంతో పక్క రాష్ట్రాల నుంచి నదియా, ఖుష్బు లాంటి వారినో లేదా బాలీవుడ్ నుంచి ఇంకెవరినో తల్లి, అత్త పాత్రల కోసం తీసుకొస్తే ఆ సినిమాకు ఆటోమేటిక్‌గా ఒక ‘గ్రాండ్ లుక్’, ‘పాన్ ఇండియా అప్పీల్’ వస్తుందని నిర్మాతలు, దర్శకులు భావిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఈ ముఖాలు పరిచయం కావడం వల్ల డబ్బింగ్ బిజినెస్ సులువు అవుతుందనేది వారి అసలు లెక్క.
అయితే ఇక్కడ మేకర్స్ విస్మరిస్తున్న అతిపెద్ద లాజిక్ ఒకటి ఉంది. ప్రకాష్ రాజ్, రావు రమేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ లాంటి మగ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఏడాదికి పదుల సంఖ్యలో సినిమాలు చేస్తున్నా ఎవరికీ ‘రెగ్యులర్’ అనిపించరు. వాళ్ళు లేకుండా సినిమాలు తీయలేరు. కానీ అచ్చమైన తెలుగు భాష మాట్లాడే, మన నేటివిటీకి సరిగ్గా సరిపోయే స్థానిక నటీమణులు రెండు మూడు సినిమాలు చేయగానే ‘రొటీన్’ అయిపోతారా? పరభాషా నటులకు లక్షలు, కోట్లు పోసి వాళ్ళకు సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకోలేని పాత్రలు ఇచ్చే మేకర్స్.. కేవలం ‘బి’ కేటగిరీ పాత్రల కోసం కూడా ఎక్కడినుంచో కొత్త వాళ్లను దిగుమతి చేసుకోవడం స్థానిక టాలెంట్‌ను అవమానించడమే. మార్కెట్ పరిధి పెంచుకోవడం, బిజినెస్ లెక్కలు చూసుకోవడం సినిమా పరిశ్రమలో తప్పు కాదు. కానీ ఆ వ్యాపారపు లెక్కల్లో పడి, అద్భుతమైన నైపుణ్యం ఉన్న మన స్థానిక సీనియర్ ఆర్టిస్టులను “మీరు రెగ్యులర్ అయిపోయారు” అని పక్కన పెట్టడం కచ్చితంగా విచారకరం. రజిత అడిగిన ఈ ప్రశ్న కేవలం ఆమె ఆవేదన మాత్రమే కాదు.. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఎంతోమంది తెలుగు నటీమణుల గొంతుక. ఈ విషయంలో టాలీవుడ్ మేకర్స్ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read
- The Paradise: ఓటీటీలో నాని విధ్వంసం.. నెగెటివ్ టాక్‌తోనూ నెంబర్ 1 స్థానంలో 'ది ప్యారడైజ్'!
- AK 47: 'ఆదర్శ కుటుంబం'పై తగ్గిన క్రేజ్.. తమన్ పాటలతో మరింత డౌన్.. ఇక ట్రైలర్‌పైనే ఆశలు!
- Kalki 2: భైరవ ఈజ్ బ్యాక్.. ప్రభాస్ బర్త్‌డే స్పెషల్..! ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే మేకింగ్ వీడియో..
- Kajal Aggarwal-Ramayana: 'రామాయణ'లో చందమామ ఉందా?.. సీన్స్ తీసేశారా?
తాజావార్తలు
-
The Paradise: ఓటీటీలో నాని విధ్వంసం.. నెగెటివ్ టాక్‌తోనూ నెంబర్ 1 స్థానంలో ‘ది ప్యారడైజ్’!
-
BJP: కాంగ్రెస్‌లో ప్రియాంక గాంధీ vs రాహుల్ గాంధీ.. బీజేపీ సంచలన ఆరోపణలు..
-
Bhumana Karunakar Reddy: ఎక్కడికక్కడ నామినేషన్లు అడ్డుకుంటున్నారు.. బీహార్‌లో కూడా ఇంత నియంత పాలన సాగలేదు..
-
Shankarpally : మేజర్‌ను మైనర్‌గా చూపి అక్రమ కేసు.. శంకర్పల్లి సీఐ, ఎస్ఐలపై యువతి సంచలన ఆరోపణలు!
-
AP Local Body Elections 2026: సీఎం చంద్రబాబుతో ముగిసిన పవన్ భేటీ.. జడ్పీ సీట్ల సర్దుబాటుపై కీలక చర్చ!
ట్రెండింగ్
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!