Madhubala: హీరోయిన్ మధుబాల లవ్ స్టోరీ.. అండర్‌వరల్డ్‌తో సంబంధం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటి హేమమాలిని మేనకోడలు హీరోయిన్ మధుబాల ఆనంద్ షా అనే ఒక బిజినెస్‌మాన్‌ని పెళ్లి చేసుకున్నారు. అయితే వారిది లవ్ మ్యారేజ్ అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. తాజాగా ఎన్‌టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చారు. ఆయన సింగపూర్‌లో బిజినెస్‌మాన్ అని, నేను నటించిన దిల్ సినిమా చూసి ఈ అమ్మాయి భలే ఉందే అని అనుకున్నారట. కానీ మా ఇద్దరికీ ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నారు. నేను జాకీ ష్రాఫ్, యాండీ బాలరాజ్‌తో ఒక సినిమా చేస్తున్నాను. అయితే నా భర్త ఆనంద్, యాండీ బాలరాజ్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అట. ఇద్దరూ ఒక సమయంలో డిన్నర్ చేస్తూ ఉండగా నేను మధుబాలతో పని చేస్తున్నానని యాండీ చెప్పడంతో నాకు పరిచయం చేయమని నా భర్త అడిగారట. అంతేకాదు, తన కంపెనీకి ఒక యాడ్ షూట్ చేయమని కూడా అడిగినట్లు చెప్పారు. నిజానికి నాకు దేనికి యాడ్ షూట్ చేయాలో కూడా తెలియదు.
Madhubala: చిరంజీవి కుర్చీలోంచి లేచి అలా అంటే షాక్ అయ్యాను!
Also Read
అయితే యాండీ మీద నమ్మకంతో నేను ఆ యాడ్ షూట్ చేయడానికి వెళ్లాను. మేము పని గురించి కేవలం 10 నిమిషాలు మాత్రమే మాట్లాడాం. ఆనంద్, నేను మామూలుగా మాట్లాడడం మొదలుపెట్టాం. ఇక తర్వాత యాడ్ షూట్ కోసం బాలి వెళ్లాం. అప్పుడు ఆనంద్ నాతో ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేశాడు. నేను వెంటనే ఇప్పుడు నేను ఫ్లర్ట్ చేసే మూడ్‌లో లేను, నా జీవితంలో ఆ స్టేజ్ ముగిసింది, ఇప్పుడు ఏదైనా సీరియస్ రిలేషన్‌షిప్ గురించి ఆలోచిస్తున్నాను అని అన్నాను. అతను వెంటనే నన్ను పెళ్లి చేసుకోమని అన్నాడు. ముందు తటపటాయించిన తర్వాత నేను కూడా చేసుకుంటానని అన్నాను. అయితే తిరిగి బాంబే వచ్చేసాక నేనేమిటి ఇంత ఈజీగా పెళ్లికి ఒప్పుకున్నాను అని కొంచెం ఆలోచనలో పడ్డాను. కొన్నాళ్లలో నా తండ్రి ఒక బెంగళూరు బేస్డ్ బిజినెస్‌మాన్ సంబంధం తీసుకురావడంతో నేను ఆనంద్‌తో పెళ్లి గురించి ఇంట్లో చెప్పాను. ముందు అతనికి అండర్‌వరల్డ్‌తో సంబంధం ఉందేమో అని భయపడ్డారు. కానీ అతని గురించి తెలిసిన తర్వాత ఇచ్చి పెళ్లి చేశారు అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
-
Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
-
IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్‌పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: పెద్ది సినిమాకి కూడా పర్సంటేజ్ కావాల్సిందే.. పట్టు పడుతున్న ఎగ్జిబిటర్లు!
-
Pakistan-Saudi Arabia: సౌదీ అరేబియా రక్షణకు పాకిస్తాన్ కిరాయి సైన్యం..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!