తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కస్తూరి పై చెన్నై మదురై సహా పలు ప్రాంతాల్లో కేసులు నమోదు చేసారు పోలీసులు. దాంతో చెన్నై వదిలి హైదరాబాద్ లో తలదాచుకుంటు మధురై హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కు దరఖాస్తు చేసింది. కానీ ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు మధురై హైకోర్టు నిరాకారించింది. కస్తూరి పుప్పాల గూడ లోని BRC అపార్ట్ మెంట్ లోని ఓ ఫ్లాట్ లో కస్తూరి ఉందన్న సమాచారం రావడంతో సైబరాబాద్ పోలీసుల సహకారంతో సినిమా చెన్నై పోలీసులు అరెస్ట్ చేసారు.
Also Read : Rapo 22: రామ్ సినిమాకు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్..?
కస్తూరిని కోర్ట్ లో హాజరుపరిచగా మాట్లాడేముందు ముందు వెనక చూసి మాట్లాడాలి, ఏది పడితే అలా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే న్యాయస్థానం చూస్తూ కూర్చోదని గట్టిగా హెచ్చరిస్తూ 14 రోజులు రిమాండ్ విధించింది. గత కొద్దీ రోజూలుగా జైలు జీవితం అనుభవిస్తున్న నటి కస్తూరి తన లాయర్లు ద్వారా బెయిల్ కోరింది. తన కూమారుడు ఆటిజంతో ఇబ్బందులు పడుతున్నారని తల్లి దగ్గర ఉండాల్సిన బాధ్యత ఉందని కోర్టును అభ్యర్ధించింది కస్తూరి. విచారణ చేసిన న్యాయస్థానం నటి కస్తూరికి ఎగ్మోర్ కోర్టు పలు షరతులు విధిస్తు బెయిల్ మంజూరు చేసింది. కాగా నేడు మధ్యంతర బెయిల్ రావడంతో నేడు జైలు నుండి విడుదల కానుంది. మరో వివాదంలో నటి కస్తూరి, బ్రాహ్మణేతరులు ఉద్యోగులపై వివాదాస్పద వ్యాఖ్యలు , కస్తూరిపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంగం డిమాండ్