Site icon NTV Telugu

Tollywood : బ్రేకప్ తర్వాత దూసుకెళ్తోన్న ముద్దుగుమ్మలు

Tollywood (2)

Tollywood (2)

తమన్నా, విజయ్‌ వర్మ పెళ్లి చేసుకోకపోయినా. మూడేళ్ల నుంచి భార్యాభర్తల్లాగానే కలిసి మెలిసి తిరిగారు. మిల్కీ బ్యూటీ ఎక్కడువెళ్లినా ప్రియుడిని తీసుకెళ్లింది. అయితే రెండు నెలల నుంచి తమన్నా సోలోగా కనిపించడంతో బ్రేకప్‌ రూమర్స్‌ చక్కర్లు కొడుతున్నాయి. ఇగోలు డామినేషన్స్‌ వున్నట్టుండి క్లాష్‌ కావడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారట. లవర్స్‌తో విడిపోయిన తర్వాతే చాలామంది ముద్దుగుమ్మల కెరీర్‌ దూసుకుపోయింది. మూడేళ్లుగా విజయ్‌ వర్మ ప్రేమలో విహరించి రీసెంట్‌గా బ్రేకప్‌ చెప్పేసింది. ఇక నుంచైనా కెరీర్‌పై కేర్‌ పెట్టి మళ్లీ టాప్‌ పొజిషన్‌కు వెళ్ళాలి.  బ్రేకప్‌ తర్వాత ముద్దుగుమ్మల సుడి తిరిగినట్టు. ఈ అమ్మడుకు కూడా ఆ జాబితాలో చేరుతుందేమో చూడాలి మరి.

ఇక శృతిహాసన్‌ అయితే డేటింగ్‌లో పడి కెరీర్‌ను పక్కన పెట్టేసింది. డూడిల్‌ ఆర్టిస్ట్‌ సతాను హజారికాతో మూడేళ్ల డేటింగ్‌ తర్వాత గుడ్‌బై చెప్పేసింది. దీనికి ముందు కూడా సిద్దు అనే ఓ  అబ్బాయిని ప్రేమించి కమల్‌కు కూడా పరిచయం చేసింది. ఇంకేముంది పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా చేసుకుంటారనుకున్నారంతా. సిద్దుతో మొదలైన ప్రేమకథను సీక్వెల్స్‌ వారీగా నడిపించింది. ప్రస్తుతం సోలోగా వున్న శృతి బ్రేకప్‌ తర్వాతే రజనీకాంత్‌ కూలీ ఛాన్స్‌ అందుకోవడమేకాదు  చేతినిండా సినిమాలతో బిజీగా వుంది.

రష్మిక ప్రస్తుతం విజయ్‌దేవరకొండ ప్రేమలో వుందంటూ వార్తలు వస్తున్నా కెరీర్‌ తొలి నాళ్లల్లోనే ఈ అమ్మడికి బ్రేకప్‌ స్టోరీ వుంది. డెబ్యూ మూవీ ‘కిరాక్‌ పార్టీ’తోనే హీరో రక్షిత్‌ శెట్టి ప్రేమలో పడింది. ఇక పెళ్లే తరువాయి అన్నట్టు ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ లవ్‌స్టోరీకి బ్రేకప్‌ పడింది. ఆతర్వాత తక్కువ టైంలోనే స్టార్‌గా ఎదిగి పాన్‌ ఇండియా హీరోయిన్‌గా ఊహించని స్టార్‌డమ్‌ సొంతం చేసుకుంది రష్మిక. ఇలా బ్రేకప్ తర్వాత ఈ ముద్దుగుమ్మలు కెరీర్ లోస్టార్ గా ఎదుగుతూ దూసుకెళ్తున్నారు.

Exit mobile version