Action King Arjun: ‘పాలిటిక్స్ అంటే పైసల గేమ్.. నా దగ్గర అంత డబ్బు లేదు’ పొలిటికల్ ఎంట్రీపై యాక్షన్ కింగ్ అర్జున్ క్లారిటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Action King Arjun: సినీ ఇండస్ట్రీలో ‘ఒక్కే ఒక్కడు’ సినిమాతో వన్ డే సీఎంగా వెండితెరపై సంచలనం సృష్టించిన యాక్షన్ కింగ్ అర్జున్.. తన రియల్ లైఫ్ పొలిటికల్ ఎంట్రీపై ఎట్టకేలకు పూర్తి స్పష్టత ఇచ్చారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా యాక్షన్ థ్రిల్లర్ ‘బ్లాస్ట్’ (Blast) మూవీ ప్రెస్ మీట్ ఈవెంట్లో పాల్గొన్న అర్జున్.. రాజకీయాల్లోకి రావడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను రాజకీయాలకు ఎందుకు దూరంగా ఉంటున్నానో చెబుతూనే, తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డు సృష్టించిన దళపతి విజయ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
డబ్బు లేకపోతే రాజకీయం కష్టం
రాజకీయ అరంగేట్రం గురించి ఆయనను ప్రశ్నించగా.. దానికి యాక్షన్ కింగ్ చాలా ఓపెన్‌గా స్పందించారు. “ఈ రోజుల్లో పాలిటిక్స్ చేయాలంటే చాలా డబ్బు ఉండాలి. అంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టే ఆర్థిక స్తోమత నా వద్ద లేదు. అందుకే నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను” అంటూ తేల్చి చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల ఖర్చులను భరించే శక్తి తనకు లేదని నిక్కచ్చిగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు.
Also Read
- Vijay Deverakonda : "నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!" -
- Rashmika : "పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!"
- Rahul Sankrityan : విజయ్ - రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
- JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
సీఎం విజయ్ను కలవగానే ‘ఒక్కేఒక్కడు’ గుర్తొచ్చింది..
ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దళపతి విజయ్ను అర్జున్ మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. ఆ భేటీకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఈ వేదికపై అర్జున్ పంచుకున్నారు. “నేను విజయ్ గారిని కలవడానికి వెళ్లినప్పుడు.. ఆయనను ఆ సీఎం కుర్చీలో చూడగానే నాకు మొదటిసారి నేను నటించిన ‘ఒక్కేఒక్కడు’ (తమిళంలో ముదల్వన్) సినిమా సీన్ కళ్లముందు కదలాడింది. ఇదే విషయాన్ని నేను విజయ్‌తో అనగా.. ఆయన కూడా నవ్వుతూ ‘నాకూ అలాగే అనిపించింది సార్’ అని చెప్పారు” అంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. పార్టీ పెట్టిన అతి తక్కువ కాలంలోనే ఊహించని రీతిలో భారీ విజయాన్ని అందుకొని సీఎం అయిన విజయ్ను అర్జున్ మరోసారి మనస్ఫూర్తిగా అభినందించారు. బ్లాస్ట్ విషయానికి వస్తే.. అర్జున్, అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లో సుభాష్ కె.రాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా మే 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!