నటి అభినయ గురించి పరిచయం అక్కర్లేదు. మాట, వినికిడి శక్తి లేకపోయిన తన టాలెంట్‌తో ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. తమిళనాడుకు చెందిన ఈ అమ్మడు ఇటు తెలుగులో కూడా చాలా చిత్రాలు చేసింది. ‘నేనింతే’,‘శంభో శివ శంభో’, ‘దమ్ము’, ‘ఢమరుకం’, ‘జీనియస్’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ధృవ’, ‘రాజుగారి గది 2’, ‘సీతా రామం’, ‘ది ఫ్యామిలీ స్టార్’ వంటి చిత్రాల్లో తన నటనతో ఎంతగానో మెప్పించింది. అలా మొత్తంగా 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న అభినయ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఇలా పలు భాషలలో చిత్రాలు చేసింది. అయితే ఈ ముద్దుగుమ్మ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టబోతున్న విషయం తెలిసిందే.
Also Read: Trump : అతిథి పాత్రలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..
రీసెంట్ గా ఎంగెజ్‌మోంట్ ఫోటోలు కూడా పంచుకోగా, పెళ్ళి సంబరాలు మొదలయ్యయట మూడు ముళ్ల బంధం లో అడుగుపెట్టనున్న అభినయ.. తాజాగా తన పెళ్లి వేడుకలకి సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. కార్తీక్ అనే వ్యక్తిని అభినయ పెళ్లి చేసుకోనుండగా, అతనితో కలిసి మెహందీ వేడుకలో దిగిన క్యూట్ ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్‌లోని ప్రముఖ కన్వెన్షన్ హాల్‌లో వీరిద్దరి పెళ్లి జరగనున్నట్లు టాక్. కాగా ఈ వేడుకకు నటీనటులంతా హాజరు కాబోతున్నారట.