AADI : జియో సైంటిస్ట్ గా ‘శంబాల’ తో వస్తున్న ఆది సాయికుమార్..
- మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆది సాయికుమార్
- హిట్టు కోసం తీవ్రంగా ప్రత్నిస్తున్న ఆది సాయికుమార్
- భారీ బడ్జెట్ లో వస్తున్న 'శంబాల'
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం వాస్తవానికి దూరంగా మరో ప్రపంచంలో జరిగే కథలకు ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అలాంటి ఓ మిస్టిక్ వరల్డ్‌లో రూపొందుతున్న సినిమా ‘శంబాల’. తాజాగా ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్మెంట్ పోస్టర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు . తొలి పోస్టర్‌తోనే గతంలో ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయని ఓ డిఫరెంట్ వరల్డ్‌లోకి ఆడియన్స్‌ను తీసుకువెళ్లబోతున్నామన్న హింట్ ఇచ్చారు.
టైటిల్ పోస్టర్లో ఒక్క మనిషి కూడా లేని గ్రామం, ప్రళయానికి ముందు భీకరంగా ఉన్న ఆకాశం, మబ్బుల్లో ఓ రాక్షస ముఖం ఇవన్నీ చూస్తుంటే ‘శంబాల’ కథ లో వెన్నులో వణుకుపుట్టించే థ్రిల్స్ చాలానే ఉన్నట్టుగా అనిపిస్తోంది. డిసిప్లిన్, డెడికేషన్ కు కేరాఫ్ గా నిలిచిన ఆది సాయికుమార్ ఈసారి జియో సైంటిస్ట్ గా ఛాలెంజింగ్ రోల్ లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో వరుస విజయాలతో లక్కీ గర్ల్ అన్న ట్యాగ్ సొంతం చేసుకున్న ఆనంది ఈ సినిమా లో ఆదీకి జోడీగా నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమా అతి త్వరలో ఆడియన్స్ ముందుకు రానుంది.
Also Read
- Rakul Preet Singh: శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు .. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
- Sree Vishnu: కంఫర్ట్ జోన్ దాటిన యంగ్ హీరో.. కెరీర్‌కు మరో టర్నింగ్ పాయింట్ అవుతుందా?
- Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
- Tamannaah: ఆ యాక్టర్ కామెంట్స్‌పై ఏడాది తర్వాత స్పందించిన తమన్నా..
సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇండియన్ స్క్రీన్ మీద ఇంత వరకు టచ్ చేయని డిఫరెంట్ స్టోరీ లైన్‌ను చూపించబోతున్నారు. అమెరికాలోని న్యూయార్క్ ఫిలిం అకాడమీలో ఫిలిం మేకింగ్ ట్రైనింగ్ తీసుకున్న యుగంధర్, ‘శంబాల’ సినిమాను హాలీవుడ్ స్థాయిలో హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో, గ్రాండ్ విజువల్స్‌తో రూపొందిస్తున్నారు. ఖర్చు విషయంలో ఏ మాత్రం వెనుకాడకుండా విజువల్స్ పరంగా, టెక్నికల్ గా సినిమాను “టాప్ క్లాస్”అనే రేంజ్లో తెరకెక్కించేందుకు అన్ని రకాలుగా సహకరింస్తున్నారు నిర్మాతలు రాజశేఖర్ అన్నభీమోజు , మహిధర్ రెడ్డి.
టెక్నికల్ సపోర్ట్ విషయంలోనూ హాలీవుడ్ రేంజ్ టెక్నీషియన్స్‌నే తీసుకున్నారు యుగంధర్. డ్యూన్, ఇన్సెప్షన్, బ్యాట్ మ్యాన్, డన్ కిర్క్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ అయిన హాన్స్ జిమ్మర్ లాంటి లెజెండరీ హాలీవుడ్ కంపోజర్స్‌తో కలిసి వర్క్ చేసిన ఇండియన్ మ్యూజీషియన్ శ్రీరామ్ మద్దూరి ఈ సినిమాకు సంగీతమందిస్తున్నారు. బ్యాక్గ్రౌండ్స్ స్కోర్స్ విషయంలోనూ ఇంతకు ముందు ఏ సినిమాలో ఎక్స్పీరియన్స్ చేయని కొత్త సౌండింగ్‌ను ఈ సినిమాలో వినిపించబోతున్నారు.
తాజావార్తలు
-
Mule Accounts : సైబర్ నేరగాళ్లకు ‘మ్యూల్’ ఖాతాల విక్రయం… అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు, ముగ్గురు అరెస్ట్!
-
Raptadu School Attack: బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి ఘటన.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు?
-
Bangladesh: ‘‘ఢిల్లీనా.. ఢాకానా?’’ బంగ్లాదేశ్‌లో మళ్లీ భారత్ వ్యతిరేక నినాదాలు
-
Konaseema: తుఫాన్ విధ్వంసం.. కరెంట్ లేక అంధకారంలో 200 గ్రామాలు.. ప్రజల కష్టాలు వర్ణనాతీతం
-
CM Vijay: తేని జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్.. సీఎం విజయ్ సంచలన చర్య, అధికారులపై వేటు!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!